Ads
ఒక్కోసారి సీరియల్ వాళ్ళు చేసే అతి చూస్తే నవ్వు ఆగదు. అసలు ఎందుకు అలాంటి సన్నివేశాలను చేస్తారో వాళ్ళ కైనా అర్థమవుతుందా అనిపిస్తుంది. సీరియల్ లో చేసే అతికి చూసే ప్రేక్షకుల మతి పోతుంది. వాళ్ల నటన వెండితెర నటుల నటనను మించి ఉంటుందని చెప్పవచ్చు.
Video Advertisement
మామూలుగానే సీరియల్స్ అంటే సాగతీత ఎక్కువ ఉంటుంది. ఒక్కో సన్నివేశాన్ని ఐదు పది నిమిషాల పాటు స్లో మోషన్ లో చూపిస్తూ.. ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ ను చూపిస్తూ విసుగు తెప్పించేస్తుంటారు.
హిందీ సీరియల్స్ అయినా.. తెలుగు సీరియల్స్ అయినా.. భాషతో సంబంధం లేకుండా.. ఏ సీరియల్ ను చూసిన ఇదే పరిస్థితి. హిందీ సీరియల్స్ కు తెలుగు నాట కూడా ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సన్నివేశాలలో కూడా సాగతీత ఉండనే ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సీరియల్స్ కు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. ఈ సీరియల్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలను చూస్తే వచ్చే ఫాలోయింగ్ కూడా పోతుందేమో అన్నట్లు అనిపిస్తుంది.
ఇప్పుడు కోడలా కోడలా.. కొడుకు పెళ్ళామా.. అనే పేరుతొ ప్రసారం అవుతున్న హిందీ సీరియల్ లో ఓ సన్నివేశం కూడా అలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ డాక్టర్ ఒక పేషెంట్ కి బిపి మెషిన్ తో చెక్ చేస్తూ కనిపిస్తుంది. కానీ.. ఆమె షుగర్ లెవెల్ బాగా తగ్గిపోయింది అంటూ డైలాగ్ చెబుతుంది. బిపి మెషిన్ తో షుగర్ లెవెల్స్ ని ఎలా చెక్ చేసారు అంటూ నెటిజన్స్ ఈ వీడియోను చూసి ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు. బిపి లెవెల్ పడిపోతే అది.. షుగర్ లెవెల్ తక్కువ అయినట్లు కాదు అంటూ మరికొందరు హితవు చెబుతున్నారు. ఈ వీడియోను డాక్టర్ నిరంజన్ సమాని తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Watch Video:
https://www.youtube.com/shorts/p8PwGaPuqa0
watch video –> click here
End of Article