విద్యార్థులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరేమో బాగా చదివి మంచి మార్కులు సంపాదించుకున్నవారైతే, రెండోవారు పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు బట్టీ పట్టేసి పరీక్షల సమయంలో బ్రెయిన్ లో ఉన్న మొత్తం బుక్ లో ఉన్నట్లుగా ఆన్సర్ షీట్ మీద దింపుతారు. ఈ మూడో రకం వాళ్ళు ఏదో చదవమంటే చదవు అన్నట్లు పరీక్షల సమయం వచ్చేసరికి తమకు తోచిన విధంగా ఆన్సర్స్ రాస్తూ ఉంటారు.

Video Advertisement

ఇప్పుడు ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ విద్యార్థి రాసిన ఆన్సర్ చూసిన సదరు టీచర్ కూడా షాక్ కు గురయ్యారు. ఆ విద్యార్థి రాసిన ఆన్సర్ను  ఫోటో తీసి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఆన్సర్ షీట్ లో ఉన్న ఆన్సర్ ఏంటో మనం కూడా ఒకసారి చూద్దాం.

వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ క్వశ్చన్ కి ఆ విద్యార్థి ఈ విధంగా జవాబు రాశాడు.

హార్డ్వేర్ హార్డ్ గాను, సాఫ్ట్వేర్ సాఫ్ట్ గాను ఉంటుందట , హార్డ్వేర్ హార్డ్వేర్ వేరే, సాఫ్ట్వేర్ కూడా వేరే వీటి మధ్య  తేడా ఏమీ లేదు. హార్డ్ వేర్ ఇస్ నాట్ సాఫ్ట్, సాఫ్ట్ వేర్ ఇస్ నాట్ హార్డ్ అని తనదైన శైలిలో జవాబు రాశాడు ఈ విద్యార్థి. ఇది కాస్తా సోషల్ మీడియా పుణ్యమా అని నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సైతం ఇదేం ఆన్సర్ రా అయ్యా, ఇలా కూడా రాస్తారా.. అంటూ కామెంట్ చేస్తూ పొట్ట చెక్కలు అయ్యేటట్లు నవ్వుకుంటున్నారు.