Ads
GAAMI REVIEW in Telugu: ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్, ఇప్పుడు గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : గామి
- నటీనటులు : విశ్వక్ సేన్, చాందిని చౌదరి, M G అభినయ, మహ్మద్ సమద్.
- నిర్మాత : కార్తీక్ శబరీష్
- దర్శకత్వం : విద్యాధర్ కాగిత
- సంగీతం : నరేష్ కుమారన్
- విడుదల తేదీ : మార్చి 8, 2024
గామి స్టోరీ :
శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరాల సమూహం నుండి వెలివేయబడతాడు. శంకర్ కి ఒక అరుదైన సమస్య ఉంటుంది. ఆ సమస్య వల్ల చర్మం అంతా కూడా తెల్లగా అయిపోయి, రక్తం లేకుండా అయిపోతుంది. శంకర్ కి గతం ఉంటుంది. కానీ ఆ గతం తనకి సరిగ్గా గుర్తుండదు. తన ఆరోగ్య సమస్యకి పరిష్కారం వెతుక్కోవడానికి హిమాలయాలకు బయలుదేరుతాడు. శంకర్ కి సహాయం చేయడానికి జాహ్నవి (చాందిని చౌదరి) కూడా అతనితో పాటు కలిసి హిమాలయాలకు వెళుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శంకర్ గతం ఏంటి? అతను అనుకున్నది సాధించగలిగాడా? శంకర్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
గామి రివ్యూ :
మూడు కథలు ఒకే సమయంలో నడుస్తూ ఉంటాయి. అయినా సరే ఎటువంటి గందరగోళం లేకుండా దర్శకుడు సినిమాని నడిపించారు. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథలు రావడం భారతదేశంలోనే మొదటి సారి ఏమో. ప్రయత్నం విషయంలో మాత్రం సినిమా బృందానికి ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంత గొప్ప కాన్సెప్ట్ ని తెలుగు తెరకి పరిచయం చేసినందుకు దర్శకుడు విద్యాధర్ కి థాంక్స్ చెప్పాల్సిందే. సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమా అని ఒక్కచోట కూడా అనిపించదు.
ముఖ్యంగా సిహెచ్ విశ్వనాధ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ అయితే ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అని ఒక ఫీల్ వచ్చేలాగా చేస్తుంది. హిమాలయాల్లోని లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. మూవీ చాలా స్లోగా మొదలవుతుంది తర్వాత ఇంకొక రెండు స్టోరీలు అదనంగా యాడ్ అవుతాయి. తర్వాత అన్ని కలిపి ఒకే సమయంలో చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ కి సెటప్ చేయడానికి ఉపయోగించారు. సెకండ్ హాఫ్ లో స్టోరీ మొత్తాన్ని పెట్టారు. దాంతో ఫాస్ట్ హాఫ్ చాలా డల్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ సినిమా మొత్తంలో అఘోరా పాత్రలో కనిపించారు. ఇది ఒక డిఫరెంట్ పాత్ర.
చాలా బాగా నటించారు. ఇందులో డైలాగ్స్ తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఒక పాత్రని చాలా బాగా విశ్వక్ సేన్ హ్యాండిల్ చేశారు. చాందిని చౌదరి పాత్ర సినిమాలో హీరోయిన్ పాత్ర కంటే కూడా ఒక ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు. తనకిచ్చిన పాత్రలో తను బాగా చేశారు. తుంబాడ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మహ్మద్ సమద్ కూడా ఈ సినిమాలో నటించారు. అతను కూడా తనకిచ్చిన పాత్రలో చాలా బాగా నటించారు. నటి అభినయ కూడా పాత్ర పరిధి మేరకు నటించారు. పర్ఫార్మెన్స్ విషయం గురించి పెద్దగా చెప్పడానికి లేదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా కూడా సినిమా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఆ డ్రాగ్ లేకుండా చూసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ లైన్
- లొకేషన్స్
- సాంకేతిక విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే ఫస్ట్ హాఫ్
- డల్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
టాలీవుడ్ సినిమాలు అన్న తర్వాత ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇది అలా కాకుండా హాలీవుడ్ సినిమాలాగా స్లో బర్న్ స్క్రీన్ ప్లే లాగా ఉంది. సినిమా మాత్రం చాలా మంచి ప్రయత్నం. ఇలాంటి కొత్త దర్శకులని ఎంత ప్రోత్సహిస్తే, ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తెలుగులో కూడా అన్ని ఎక్కువగా వస్తాయి. గత కొన్ని సంవత్సరాలలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప ప్రయత్నంగా గామి సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article