‘జబర్దస్త్’ తెలుగు రాష్ట్రాల్లో..సంచలనమే సృష్టించిన ఒక ప్రోగ్రాం..ఎందరినో ఆర్టిస్టులను తెరపైకి తెచ్చి.వారి టాలెంట్ ని నిరూపించుకునేలా చేసిన ఒక స్టేజ్..బుల్లి తెర నుంచి వెండి తెర కి ప్రమోట్ అయ్యారు కొందరు కమెడియన్స్..తాగుబోతు రమేష్,హైపర్ ఆది,అదిరే అభి,సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీను,ఆటో రామ్ ప్రసాద్,మహేష్ ఆచంట..మరెందరినో టాలీవుడ్ కి పరిచయం చేసింది..వీరిలాగే…మరెందరో వారి టాలెంట్ ని నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు.!

Video Advertisement

హైపర్ ఆది స్కిట్స్ లో బాగా ఫేమస్ అయిన గణపతి మాస్టర్ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను…జబర్దస్త్ కి పరచియం ఎలా అయ్యారని..ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు..గణపతి మాస్టర్ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం వృత్తి పరంగా ఆయన ఒక టీచర్..నటన మీద ఆసక్తి ఉండటం తో జాబ్ మానేసి హైదరాబాద్ కి వచ్చేసారు..కొత్త వేషాల అన్వేషణలు చేసే వాళ్లంతా శ్రీ శ్రీ హోటల్ దగ్గర కలిసేవారట.అమన్ అనే వ్యక్తి ద్వారా ఏర్పడిన పరిచయం ద్వారా మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం వచ్చిందట..

లావుగా మరి పొట్టిగా ఉన్న వారి కోసం చూస్తున్న తరుణం లో గణపతి మాస్టర్ ఎదురయ్యారు.ఆలా తొలి అవకాశం దక్కించుకున్నారు.అమన్ ద్వారా మరో సినిమా నటించే అవకాశం కూడా వచ్చిందట లవ్ యూ బంగారం సినిమాలో ఛాన్స్ కొట్టేసారు.అటు తరువాత షకలక శంకర్ ని కలవటం..ఆయన టీం లీడర్ కావటంతో మొదటి ఆఫర్ ఆలా దక్కించుకున్నారు.రెండు సంవత్సరాల పాటు షకలక శంకర్ తో కలిసి పని చేసిన తరువాత సినిమాలో బిజీ కారణంగా షకలక శంకర్ జబర్దస్త్ ని వదిలేయటం తో గణపతి మాస్టర్ ఆర్థికంగా కూడా సంపాదన ఎంతో అవసరం ఉండటంతో జబర్దస్త్ ని వదలలేక పోయారు..

అదిరే అభి ని కలసిన గణపతి మాస్టర్..హైపర్ ఆది కి గణపతి మాస్టర్ ని పరిచయం చేయటం తో స్క్రిప్ట్ లోని డైలాగ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనేవారట..అదిరేఅభి స్కిట్ అయిపోయిన సాయంకాలానికి బిర్యానీ తినిపించి మరీ చెక్ ఇచ్చేవారట..ఆలా ఆది జబర్దస్త్ లో గణపతి మాస్టర్ కి సహాయం చేశారట..గణపతి మాస్టర్ తొలి స్కిట్ చేస్తే వచ్చిన డబ్బు వెయ్యి రూపాయలట.