బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ “గంగవ్వ” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ “గంగవ్వ” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Megha Varna

Ads

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయ్యి అప్పుడే వారం రోజులు అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

Video Advertisement

ఈసారి కంటెస్టెంట్స్ లో మరి ఎక్కువగా పాపులర్ అయిన వాళ్ళు కాకుండా, అలా అని అసలు తెలియని వాళ్లు కాకుండా కొంత మంది బాగా తెలిసిన వాళ్ళని, ఇంకొంతమంది సోషల్ మీడియా లో పాపులర్ అయిన వాళ్లని సెలెక్ట్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో కొంచెం ఎక్కువ పాపులర్ అయింది లాస్య, దేవి నాగవల్లి, దేత్తడి హారిక, గంగవ్వ, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్. కాబట్టి హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ కూడా వీళ్లే.

యూ ట్యూబ్ లో మై విలేజ్ షో అనే చానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ కి వారానికి మూడు నుండి నాలుగు లక్షల పారితోషకం ఇస్తున్నట్టు సమాచారం.

Also read: బిగ్ బాస్ 4 “గంగవ్వ” వెనక కన్నీటి కథ

బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో గంగవ్వ తన గురించి మాట్లాడుతూ తనకి 5 ఏళ్ళ వయసున్నప్పుడు పెళ్లయిందని,  కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త దుబాయ్ కి వెళ్తా, అక్కడి నుండి డబ్బులు పంపిస్తా అని అనడం తో అప్పుచేసి తన భర్తని దుబాయ్ కి పంపించాను అని, కానీ తన భర్త డబ్బులు పంపించలేదు అని, దాంతో అతను చచ్చిపోయాడు అని అనుకున్నానని,

తన బిడ్డకి ఫిట్స్ వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు అని, హాస్పిటల్లో చనిపోతే ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చానని, తనకి కొన్నాళ్ల క్రితం వరకు ఎనిమిది లక్షల అప్పు ఉండేది అని, మూడేళ్ళు కష్టపడి ఆ అప్పు తీర్చానని, అలా వీడియోలు చేస్తూ ఉంటే జీతం ఇస్తున్నారని, దేవుడి దయవల్ల ఇప్పుడు ఒక స్థాయిలో ఉండగలిగానని అన్నారు.

బిగ్ బాస్ షో కి పట్టు చీర కట్టుకొని ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఆ చీర బిగ్ బాస్ యాజమాన్యం కొన్నారని, తను ఇప్పటి వరకు అలాంటి చీర కట్టుకోలేదని, ప్రస్తుతం తను ఉంటున్న ఇంట్లో వర్షం వస్తే నీళ్లు ఇంట్లోకి వచ్చి ఇబ్బందిగా ఉంటుందని, బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు గంగవ్వ.


End of Article

You may also like