బిగ్ బాస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఒక ఎత్తయితే, గంగవ్వ మరొక ఎత్తు. గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్తున్నారు అనే వార్త గత కొంత కాలం నుండి ప్రచారంలో ఉంది. కానీ చాలామంది ఇది నిజమో కాదో అనే డైలమాలో ఉన్నారు. కానీ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ తర్వాత అందరి అనుమానాల కి ఫుల్ స్టాప్ పడింది.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ పదహారవ కంటెస్టెంట్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చారు. మనలో చాలామందికి గంగవ్వ ఎవరో తెలిసే ఉంటుంది. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ వీడియోస్ చేస్తూ ఉంటారు.

బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో గంగవ్వ తన గురించి మాట్లాడుతూ తనకి 5 ఏళ్ళ వయసున్నప్పుడు పెళ్లయిందని,  కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త దుబాయ్ కి వెళ్తా, అక్కడి నుండి డబ్బులు పంపిస్తా అని అనడం తో అప్పుచేసి తన భర్తని దుబాయ్ కి పంపించాను అని, కానీ తన భర్త డబ్బులు పంపించలేదు అని, దాంతో అతను చచ్చిపోయాడు అని అనుకున్నానని,

తన బిడ్డకి ఫిట్స్ వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు అని, హాస్పిటల్లో చనిపోతే ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చానని, తనకి కొన్నాళ్ల క్రితం వరకు ఎనిమిది లక్షల అప్పు ఉండేది అని, మూడేళ్ళు కష్టపడి ఆ అప్పు తీర్చానని, అలా వీడియోలు చేస్తూ ఉంటే జీతం ఇస్తున్నారని, దేవుడి దయవల్ల ఇప్పుడు ఒక స్థాయిలో ఉండగలిగానని అన్నారు.

బిగ్ బాస్ షో కి పట్టు చీర కట్టుకొని ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఆ చీర బిగ్ బాస్ యాజమాన్యం కొన్నారని, తను ఇప్పటి వరకు అలాంటి చీర కట్టుకోలేదని, ప్రస్తుతం తను ఉంటున్న ఇంట్లో వర్షం వస్తే నీళ్లు ఇంట్లోకి వచ్చి ఇబ్బందిగా ఉంటుందని, బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు గంగవ్వ.