Ads
గంగూభాయిని మొదట్లో ఎంతో హీనంగా చూసేవారు. ఆమె దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండేవి కాదు. కానీ అటువంటి గంగు భాయ్ అవమానించిన వాళ్ల కళ్ళ ముందే దర్జాగా బతికింది. మాఫియా క్వీన్ గా ఈమె మారింది.
Video Advertisement
అయితే గంగూభాయి రియల్ స్టోరీని మీరు చూస్తే ఆమె కోసం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. 500 రూపాయల కోసం గంగుభాయ్ ని ప్రేమించిన వ్యక్తి వ్యభిచారి గృహం కి అమ్మేశాడు. అక్కడి నుండి ఆమె మాఫియా క్వీన్ గా మారింది. మరి ఇప్పుడే చూసేయండి.
1939 గుజరాత్ లోని ఒక వ్యాపారికి గంగా అనే ఒక అమ్మాయి జన్మించింది. వ్యాపారి అవ్వడంతో తన కూతురికి మంచిగా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కానీ ఈమె మాత్రం హీరోయిన్ అవ్వాలని అనుకుంది. దీంతో సినిమాలో అవకాశాలు కోసం ముంబై వెళ్లాలని అనుకుంది. అయితే గంగ తండ్రి దగ్గర ఒక అకౌంటెంట్ పనిచేసేవాడు. అతని పేరు లవ్నిక్ లాల్. అయితే వీళ్ళిద్దరూ మొదట మామూలుగా మాట్లాడుకునే వారు. తర్వాత ప్రేమ మొదలైంది. ఒకరోజు గంగ తనకి హీరోయిన్ అవ్వాలని ఉంది అని చెప్పింది.
ఇక ఆమెను అడ్డంపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ముంబై తీసుకువెళ్ళాడు. డబ్బు, బట్టలు తీసుకుని గంగ లవ్నిక్ లాల్ తో పాటు ముంబై వెళ్ళింది. త్వరలో పెళ్లి చేసుకుందామని ఒక గది తీసుకుని అందులో ఇద్దరు ఉన్నారు. కొన్ని రోజులకి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇక గంగా పై ఆసక్తి తీరిపోయిన లవ్నిక్ లాల్ ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు.
గంగా నువ్వు దగ్గర్లో ఉన్న మా చుట్టాల ఇంట్లో ఉండు నేను నీకోసం సినిమా వాళ్ళతో మాట్లాడడానికి వెళుతున్నాను అని చెప్పి టాక్సీ ఎక్కించాడు. టాక్సీ డ్రైవర్ కి అడ్రస్ చెప్పి గంగని తీసుకు వెళ్ళమన్నాడు. అయితే ఇక్కడ గంగకి తెలియని విషయం ఏమిటంటే ఆమెని వ్యభిచారి గృహానికి పంపిస్తున్నాడు. 500 రూపాయలు కి గంగని అమ్మేశాడు. గంగ ఇంక వ్యభిచార గృహానికి వెళ్లి పోయింది. అయితే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి గంగని అనుభవించేవారు.
ఈ డబ్బులు ఏమీ గంగకి ఇచ్చేవారు కాదు. అక్కడ ఉండే యజమానే డబ్బులు అన్నీ తీసుకునేది. అయితే గంగ యజమానురాలి పీడ వదిలించుకోవాలి అనుకుంది. కొన్ని రోజులకే ఆమెను తరిమేసి గంగ యజమానురాలు అయింది. ఆ తర్వాత గంగ ఎవర్ని హింసించేది కాదు. యజమాని అయినా సరే అందరి బాధలు అర్థం చేసుకునేది. రౌడీలు పోలీసులు గొడవలకి వచ్చినా తరిమేసేది గంగా. ఇలా గంగ ఒక నాయకురాలిగా మారింది. గంగ ఉండే రెడ్ లైట్ ఏరియా కరీంలాలా అధీనంలో ఉండేది.
ఒక రోజు అతని మనిషి వచ్చి గంగని దారుణంగా రేప్ చేశాడు. ఇలా చాలాసార్లు జరిగింది. దీనితో గంగ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక డైరెక్టుగా కరీమ్ లాల దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత అతను గంగ ధైర్యానికి మెచ్చి నీ దగ్గరికి ఇంకెవరు గొడవలకు రారు. నా మనుషులు కూడా రారు అని చెప్పాడు. ఓరోజు వేశ్య గృహాల ఎలక్షన్ జరిగింది. దానిలో గంగ నిల్చుని గెలిచింది. దీంతో గంగ గంగూబాయి కతీయవాడి అని పేరు మార్చుకుంది.
అలానే ఆమె వేశ్య ల ద్వారా వచ్చే డబ్బును వాళ్ళ కోసమే ఖర్చు చేసేది. వేశ్యల కోసం ఆమె విప్లవాత్మక ప్రసంగం చేసింది. అది అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యింది. వేశ్యలకి కూడా హక్కులు ఉండాలి అని ఆమె అప్పట్లో చెప్పగా… ఆమె మాటలు విన్న జవహర్ లాల్ నెహ్రూ ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎవరు వేశ్యలని వేదించద్దు అని చెప్పారు. అలానే వారిని హీనంగా చూడకూడదని ఆదేశించారు. ఇలా వేశ్యల కోసం గంగుబాయి ఎంతగానో కష్టపడింది.
End of Article