పురాణాల్లో కరోనాకి విరుగుడు ఉంది అంటున్న గరికపాటి.

పురాణాల్లో కరోనాకి విరుగుడు ఉంది అంటున్న గరికపాటి.

by Anudeep

కరోనాతో ప్రపంచం దేశాలన్ని యుద్దం చేస్తున్నాయి.. వాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమని ,కనీసం ఉపశమనం అయినా చూడడం కొంతలో కొంత మేలని తలచి, ఏఏ దేశాలు ఏ మందులు వాడితే కరోనా నయం అవుతుందా అని సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.. అన్ని దేశాల డాక్టర్లు, శాస్త్రవేత్తలు కరోనాకి మందు కనుక్కోవడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు..ఇదలా ఉంటే కరోనా గురించి పురాణాల్లో ఉందని, మందు కూడా సూచించారని అంటున్నారు గరికపాటి.

Video Advertisement

ప్రముఖ ప్రవచనకర్తగా గరికపాటి అందరికి సుపరిచితులే, ఇటీవల ఆయన ఒక టీవి ఛానెల్తో కరోనా గురించి మాట్లాడుతూ “ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రస్తావన మన పురాణాల్లోనే ఉంది, దానికి సంబంధించిన మందు ప్రస్తావన కూడా ఉంది.. యోగ వాశిష్ట్యం అనే గ్రంథంలో చంద్రుడికి సంబంధించిన అంశాల్లో కరోనాకు విరుగుడు గురించి ఉంది, దానిపై పరిశోధనలు జరిపితే విరుగుడు త్వరగా కనుగొనవచ్చు, ఇప్పటికైనా శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించాలి” అని ఆయన అన్నారు.

యోగ వాశిష్ట్యం  గ్రంధంలో ‘విసూచిక’ అనే వ్యాధి గురించి ప్రస్తావించారని, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో అప్పుడే చెప్పారని ఇప్పుడు జరుగుతున్న తీరు కూడా అలాగే ఉందని గరికపాటి వివరించారు. అంతేకాదు  అందులో మందు గురించి, మంత్రం గురించి కూడా చెప్పారని , ఇది తేలిగ్గా తీసుకోకుండా శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశీలన చేస్తే బగుంటుందని సూచించారు. మంత్రశాస్త్ర సంప్రదాయాలు తెలిసినవాడిగా అందులో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి దాన్ని బయటికి చెప్పలేనని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29 లక్షలకు దగ్గరగా ఉంది. 2లక్షల మంది ఈ మహమ్మారి వలన మృత్యువాతపడగా, 8లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకున్నారు. మన దేశంలో కూడా కరోనా పాజిటిల్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.. ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న భయాందోళనల వలన ,గరికిపాటి వ్యాఖ్యలు సాంత్వన కలిగిస్తూ చర్చనీయాంశంగా మారింది.


You may also like

Leave a Comment