Ads
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒక హీరో హీరోయిన్ తో మొదలవ్వడం లేదా ఒక హీరోని కానీ, హీరోయిన్ ని కానీ ఒక సినిమాకి అనుకొని తర్వాత రిప్లేస్ చేయడం అనేవి జరుగుతూనే ఉంటాయి. అలా ఎంతో మంది హీరో, హీరోయిన్లు కలిసి నటించాల్సిన కాంబినేషన్స్ ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. ఈ విషయంపై ఇటీవల సీనియర్ నటి గౌతమి మాట్లాడారు.
Video Advertisement
గౌతమి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. కొంత కాలం క్రితం మొదలైన మనమంతా సినిమాలో కూడా నటించారు గౌతమి. అలాగే దృశ్యం తమిళ్ రీమేక్ అయిన పాపనాశం సినిమాలో కూడా నటించారు. గౌతమి ఇటీవల ఆలీతో సరదాగా షోలో వచ్చారు. గౌతమి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి – గౌతమి కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదు.
ఈ విషయంపై గౌతమి మాట్లాడుతూ “చిరంజీవి గారితో ఒకటి కాదు రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ మిస్ చేసుకున్నాను. అందులో ఒక సినిమా సుబ్బరామి రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరించిన సినిమా (స్టేట్ రౌడీ) కూడా ఉంది. కోఇన్సిడెన్స్ ఏంటంటే చిరంజీవి గారి సినిమా డేట్స్ అడిగిన ప్రతిసారీ రజినీకాంత్ గారి సినిమా డేట్స్ తో క్లాష్ అయ్యేవి. అప్పటికీ రజినీకాంత్ గారి సినిమా లో అండర్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండేవి” అని చెప్పారు.
అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది అని, కానీ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను అని చెప్పారు గౌతమి.
watch video :
End of Article