Ads
యాక్టర్స్ అంటే నటించే వాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే. అంటే ఏ పాత్ర అయినా సరే పోషించే వాళ్లని నటులు అని అంటారు. చాలా మంది నటులు వాళ్ళ వయసుకంటే చిన్న వయసు ఉన్న పాత్రలను, అలాగే వాళ్ళ వయసుకంటే పెద్ద వయసు ఉన్న పాత్రలను కూడా పోషిస్తారు. అలాగే ఒక సినిమాలో ఒకరికి అక్కగా, చెల్లెలిగా లేదా మరేదైనా పాత్రలలో నటించిన వాళ్లు ఇంకొక సినిమాలో భార్యాభర్తలుగా నటించి ఉండవచ్చు.
Video Advertisement
ఇందుకు ఒక ఉదాహరణ జయసుధ, ప్రకాష్ రాజ్. వీళ్లిద్దరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, కొత్త బంగారు లోకం సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. తర్వాత సోలో సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్ కి సోదరిగా నటించారు. శ్రీనివాస కళ్యాణం సినిమాలో నితిన్ కి నాయనమ్మగా నటించారు జయసుధ. అదే సినిమాలో ప్రకాష్ రాజ్, రాశి ఖన్నాకి తండ్రిగా నటించారు.
అంటే జయసుధ పాత్రకి, ప్రకాష్ రాజ్ పాత్రకి ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. వీళ్ళు ఇద్దరు మాత్రమే కాదు ఇంకొకరు కూడా ఇలాగే ఒక సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించి, మరొక సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. 2019 లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ప్రతి రోజు పండగే. ఈ సినిమాలో సత్య రాజ్ కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. కూతురి పాత్రలో గాయత్రి భార్గవి నటించారు.
మొదటి కొడుకుగా రావు రమేష్ నటించగా, రెండవ కొడుకుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్ బ్రోచేవారెవరురా సినిమాలో నివేతా థామస్ తండ్రిగా కూడా నటించారు. అయితే రాంగోపాల్ వర్మ కొత్త సినిమా మర్డర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు.ఈ సినిమా డిసెంబర్ 24 వ తేదీన విడుదలైంది.
ఈ సినిమాలో ఆయన భార్య పాత్రలో గాయత్రి భార్గవి నటించారు. వీళ్ళిద్దరూ ప్రతి రోజు పండగే సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించారు. అలా పాత్రతో పాటు ఆన్ స్క్రీన్ రిలేషన్స్ కూడా మారుతాయి. కానీ యాక్టర్స్ మాత్రం వీటిని ప్రొఫెషనల్ గానే తీసుకుంటారు.
End of Article