Ads
సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోతున్నారు ఈ మధ్య…సరైన డైలాగ్ చిన్నదో…పెద్దదో…ఆడియన్స్ కి రీచ్ అయితే చాలు వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది…ఒక్కోసారి ఆ డైలాగ్ వల్లే సినిమా మొత్తానికి క్రేజ్ ఏర్పడుతుంది.
Video Advertisement
తాజాగా కన్యాకుమారి అనే సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానాన్ని తెరకెక్కించిన దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీ చరణ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.
టీజర్ మొత్తం హీరోయిన్ గీత్ సైని బాగా ఫేమస్ అయ్యారు.మొత్తంగా ఆమె కనిపించారు. ఈ టీజర్ చూస్తుంటే ఆమె చుట్టూనే కథ తిరగనుంది అని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా టీజర్ ఎండింగ్ లో వచ్చిన డైలాగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది. హీరోయిన్ ఒక చీరల షాప్ లో ఉండి రకరకాల చీరల గురించి చెబుతూ ఇలా నేర్చుకోవాలి అంటే చెప్పే డైలాగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుక్కతిప్పుకోకుండా చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ డైలాగ్ కారణంగా సినిమా మీద ఆసక్తి పెరిగింది.
watch video :
End of Article