“గీతా మాధురి” చెప్పింది నిజమే కదా..? ఈ వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..?

“గీతా మాధురి” చెప్పింది నిజమే కదా..? ఈ వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..?

by Mounika Singaluri

Ads

ప్రముఖ తెలుగు సింగర్ గీతామాధురి గురించి పరిచయమే అక్కర్లేదు. ఆమె గొంతు విని గుర్తుపట్టే వారు చాలామంది ఉంటారు. సింగర్ గా టాలీవుడ్ లో మోస్ట్ బిజీగా ఉన్నారు. ఆమె పాడిన పాటలు ఎన్నో సూపర్ హిట్లుగా నిలిచాయి. పలు సింగింగ్ కాంపిటీషన్ లలో కూడా పాల్గొని తన ప్రదర్శన చాటుతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ నందుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది.

Video Advertisement

ఎప్పుడూ సోషల్ మీడియాలో తన పాటల గురించి ప్రస్తావించే గీతామాధురి ముఖ్యమైన విషయం గురించి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. అది విన్న ప్రతి ఒక్కరు గీతామాధురిని అభినందించకుండా ఉండలేరు.అసలు గీత మాధురి ఏమన్నారంటే…!ప్రస్తుతం సొసైటీలో పిల్లలు లేని కపుల్స్ కి సమాజం నుండి ఎక్కువగా ప్రజర్ ఉంటుందని, పిల్లలు ఎప్పుడు కంటారు? ఇంకా డబ్బు సంపాదించడమేనా పిల్లల కనరా? వచ్చే సంవత్సరం లోపు కనేస్తారా? అంటూ క్వశ్చన్స్ వేసి కపుల్స్ ని ఇబ్బంది పెడుతున్నారనిదానివల్ల వారు చాలా ప్రజర్ ఫీలవుతున్నారని తెలిపారు.

తాను ఈ మధ్యలో ఐదు ఆరుగురు కపుల్స్ తో మాట్లాడగా వారు ఈ విషయాన్ని బాధపడుతూ చెప్పినట్లుగా తెలియజేశారు. పిల్లల కనడం అనేది చాలా వ్యక్తిగత విషయమని మనం అడిగే క్వశ్చన్ వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు అని తెలిపారు.తాను ఈ విషయం మీద మాట్లాడడానికి సరిపోనని కాకపోతే సమాజంలో జరిగేది చూసి ఇలా వీడియో రూపంలో చెబుతున్నట్లుగా తెలియజేశారు. చాలామంది పిల్లలు లేని వారు ప్రజర్ తట్టుకోలేక సొంత ఊర్లకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ప్రస్తుతం పిల్లలకు కనేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని డాక్టర్లు మెరుగైన సలహాలు ఇస్తున్నారని వాటిని ఉపయోగించుకుని హెల్తీ బేబీని కనాలి తప్ప, ప్రెజర్ లో కనే బేబీ వద్దని సూచించారు.గీతా మాధురి మాటలు విన్న సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అందరూ కూడా అభినందిస్తున్నారు మంచి విషయం మాట్లాడవు అని పొగుడుతున్నారు. నిజం చెప్పాలంటే గీతామాధురి మాట్లాడిన విషయం చాలా కరెక్ట్.

Watch Video:

https://www.instagram.com/reel/Cy_nPf_h4zp/?igshid=NjZiM2M3MzIxNA==

Also Read:స్టువర్టుపురం దొంగనుండి తప్పించుకున్న హీరో…. ఇంతకీ ఎవరు?


End of Article

You may also like