Ads
సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి.. మరో వైపు పిల్లల రిజల్ట్స్ వచ్చేది కూడా అప్పుడే.. టెన్త్ , ఇంటర్ పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తాయి ఈ రిజల్ట్స్ ..ఇక ఈ రిజల్ట్స్ టైంలో టివిలో వచ్చే యాడ్స్ చూడాలి.. బాబోయ్ అనుకోకుండా ఉండలేరు..కానీ ఆ వాయిస్ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోకుండానూ ఉండలేరు..ఇంతకీ ఆ వాయిస్ ఎవరిదంటే యాంకర్ కమ్ యాక్టర్ జెమిని సురేశ్ ది..
Video Advertisement
ఒకటి ఒకటి ఒకటి… రెండు రెండు రెండూ అంటూ టివి బద్దలైపోతుందా అన్నట్టుగా వస్తుంది ఆ వాయిస్.. ఒక్క సారి చూస్తే మళ్లీ జన్మలో మర్చిపోలేం..కానీ ఆ వాయిస్ జెమిని సురేశ్ ది అంటే అంత నమ్మశక్యంగా ఉండదు..ఎందుకంటే ఆయనని చూస్తే మృదుస్వభావిలా ఉంటాడు..కానీ ఆ వాయిస్ నాదే అని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేషే స్వయంగా చెప్పారు..సురేష్ జెమిని టివిలో యాంకర్ గా, పలు సినిమాల్లో కమెడియన్ గా మనకు సుపరిచితిడే..
కెరీర్ తొలినాళ్లల్లో జెమిని టివిలో యాంకర్ గా పరిచయం అయిన సురేష్..తర్వాత అదే పేరుతో జెమిని సురేష్ గా స్థిరపడిపోయారు..తర్వాత శ వెండితెరపైన మెరిసారు…ఇటీవల సాహో, ప్రేమ ఎంత మధురం, వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ, నువ్వు తోపు రా అంటూ అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు..అనేక సినిమాలకు, ఫిలింఫేర్ అవార్డ్స్ లాంటి ఫంక్షన్స్ కి డబ్బింగ్ చెప్తున్నరు సురేష్.
ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్టులు అనగానే టక్కున సునీత,సవిత,చిన్మయ్, ఎస్పీ శైలజా,రోజారమణి,సరితా ఇలా ఎన్నో పేర్లు గుర్తొస్తాయి..కానీ మేల్ డబ్బింగ్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే పేరు ఆర్ సిఎమ్ రాజు..ఎందరో నటులు మరెందరో నటులకు డబ్బింగ్ చెప్పినప్పటికి ఆర్సిఎమ్ రాజు శైలే వేరు..అతడి బాటలోనే వెళ్తున్నారు జెమిని సురేష్..
End of Article