Ads
- చిత్రం : గని
- నటీనటులు : వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి.
- నిర్మాత : అల్లు బాబీ, సిద్దు ముద్ద
- దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
- సంగీతం : తమన్
- విడుదల తేదీ : ఏప్రిల్ 8, 2022
Video Advertisement
స్టోరీ :
గని (వరుణ్ తేజ్) విక్రమాదిత్య అనే ఒక ఒక బాక్సర్ కొడుకు. గని తండ్రి బాక్సింగ్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో విక్రమాదిత్యని గేమ్ నుండి సస్పెండ్ చేస్తారు. కానీ గని మాత్రం ఒక బాక్సర్ అయ్యి సమాజానికి తను ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటాడు. గని తల్లి (నదియా) కి గని బాక్సర్ అవ్వడం ఇష్టం లేదు. దాంతో గని తన తల్లి తెలియకుండానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాగే డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవుతాడు. విజేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) గని తండ్రికి అప్పోనెంట్ గా ఆడతాడు. విజేంద్ర సిన్హా అప్పుడు జరిగిన సంఘటన గురించి నిజం చెప్తాడు. దాంతో గాని, విజేంద్ర సిన్హా ఎలా పోరాడారు? చివరికి గని బాక్సర్ అయ్యి తానేంటో నిరూపించుకున్నాడా? గనిని ప్రేమించిన మాయ (సయీ మంజ్రేకర్) ఎవరు? గని తల్లికి ఇదంతా తెలిసిందా? విక్రమాదిత్య ఏమయ్యాడు? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఎప్పుడో గత సంవత్సరం విడుదల అవ్వాల్సిన గని సినిమా చాలా సార్లు వాయిదా పడి ఇప్పుడు విడుదల అయ్యింది. సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ చూస్తూ ఉంటే తమ్ముడు షేడ్స్ కనిపిస్తాయి. స్టోరీ విషయానికి వస్తే అంతా కొత్తగా ఏమీ అనిపించదు. చాలా సార్లు ఇలాంటి కథలు మనం చూసే ఉంటాం. ఒక స్పోర్ట్స్ కథకి ఎమోషనల్ డ్రామా యాడ్ చేసి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులోకే గని కూడా చెందుతుంది. ఫస్ట్ హాఫ్ లో గొప్పగా అనిపించే సీన్స్ ఏమీ ఉండవు. అలా వెళ్లిపోతుంది అంతే. కానీ సెకండ్ హాఫ్ లో ముఖ్య పాత్రలు ఎంటర్ అయిన తర్వాత సినిమా కొంచెం ఆసక్తికరంగా మారుతుంది.
సినిమాకి ఒక ముఖ్య బలం తమన్ సంగీతం అయితే, మరొక ముఖ్య బలం డైలాగ్స్. హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్, తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అలాగే ముఖ్యపాత్రల్లో నటించిన ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా కూడా బాగా నటించారు. కానీ ఈ సినిమాకి ఒక హైలైట్ మాత్రం వరుణ్ తేజ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అది తెరపై కనిపిస్తుంది. ప్రతి సినిమాలో తన పాత్రకు వేరియేషన్ చూపించిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో కూడా అలాంటి ఇప్పటి వరకు చేయని ఒక పాత్ర చేశారు. యాక్షన్ సీన్స్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించారు. కానీ కథ బాగున్నా కూడా తెరపై చూపించడంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- వరుణ్ తేజ్
- బాక్సింగ్ సీన్స్
- సాంకేతిక విలువలు
- సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే స్టోరీ
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- కథలో లోపించిన కొత్తదనం
- తెరపై బాగా కనిపించని ఎమోషన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో కొత్తదనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక స్పోర్ట్స్ డ్రామా చూద్దాం అనుకునేవారికి గని ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
End of Article