ఇలా చేయకపోతే “ది ఘోస్ట్” మరొక “ఆచార్య” అయ్యేదా..?

ఇలా చేయకపోతే “ది ఘోస్ట్” మరొక “ఆచార్య” అయ్యేదా..?

by Megha Varna

Ads

అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ప్రయోగాత్మక సినిమాలని సమానంగా బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడు తాపత్రయపడే నటులలో నాగార్జున ఒకరు. ఏ రకమైన పాత్ర అయినా చేయగలను అని నాగర్జున ఇప్పటికే చాలా సినిమాలతో నిరూపించారు.

Video Advertisement

సీనియర్ హీరో అయిన తర్వాత కూడా డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, ఇప్పటికి కూడా ప్రయోగాత్మక సినిమాలు అంటే ముందు వరుసలో ఉంటున్నారు.

the ghost streaming update

నాగార్జున ఆఫీసర్ పాత్ర పోషించడం కొత్త ఏమీ కాదు. కానీ ఈ ఘోస్ట్ సినిమాలో ఒక ఆఫీసర్ కి లవ్ స్టోరీ ఉండటం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే మనకి యాక్షన్ సినిమా అని అర్థం అయిపోయి ఉంటుంది. సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. అలాగే దాని వెనకాల ఒక ఎమోషన్ కూడా ఉండేలాగా డైరెక్టర్ కథ రాసుకున్నారు. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగార్జున ఈ సినిమాని నడిపించారు. ఈ సినిమా కోసం నాగార్జున ప్రత్యేక కత్తియుద్ధం కూడా నేర్చుకున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే ‘ది ఘోస్ట్’ సినిమాలో నాగార్జున సరసన నటించేందుకు మొదట కాజల్ ని అనుకున్నారు. పైగా షూటింగ్ కూడా చేసారు. కానీ సినిమా మధ్య లో ఆపేసి కాజల్ వెళ్ళిపోయింది. ఇదే విధంగా ఆచార్య సినిమాకు కూడా జరిగింది. కాజల్ ఆ సినిమాలో నటించిందట.

కానీ కొంచెం షూటింగ్ ఉంటే మధ్యలో దాన్ని ఆపేసింది కాజల్ అన్నారు. ఆ పాత్ర ని చూపించలేదు. పూర్తి చెయ్యలేదు. ఆమె సీన్స్ అన్నింటినీ కూడా తొలగించేసారు. సినిమాలో కాజల్ ఏ లేదు. ఈ విషయంపై చర్చ కూడా జరిగింది. ఇదే విధంగా నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో కూడా ఇబ్బంది అయింది.

కానీ ఆచార్య రిజల్ట్ చూసి అలర్ట్ అయ్యి సోనమ్ చౌహాన్ ని పెట్టారు. మళ్ళీ షూట్ చేసారు. ఈ సినిమా కి మంచి టాక్ వస్తోంది. అందుకే ఈ చిత్ర యూనిట్ కనుక ఆచార్య సినిమాలాగే చేస్తే అలానే సినిమా ఉండేదేమో అని జాగ్రత్త పడ్డారు. హీరోయిన్ సీన్స్ ని తొలగిస్తే ఆచార్య లాగే అయ్యేదేమో అని అంతా అంటున్నారు.

 


End of Article

You may also like