Ads
ఆకలి ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది. ఒకరోజుకి అయితే ఆకలికి ఎలా ఓర్చుకున్నా.. మరుసటి రోజుకు తట్టుకోవడం చాలా కష్టతరం అయిపోతుంది. అయితే.. ఆ పరిస్థితిలో ఎవరైనా ఎదో ఒక మార్గం కోసం ఆలోచిస్తారు. కానీ, మెక్‌కాల్ బ్రూక్ అనే ఈ అమ్మాయి చేసిన పనికి మాత్రం నెటిజన్స్ నోరెళ్ళబెడుతున్నారు.
Video Advertisement
సాధారణంగా ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుని.. పని దొరికాక అప్పు తీర్డ్చుకోవడమో.. లేక దొరికిన పని చేసుకుని కడుపు నింపుకోవడమో చేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి ఏకంగా డేటింగ్ లు చేసింది.
ఒకటి కాదు రెండు కాదు వరుసగా 16 మంది అబ్బాయిలతో డేటింగ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. మెక్‌కాల్ బ్రూక్ అనే అమ్మాయి తన ఆకలి తీర్చుకోవడం కోసం అబ్బాయిలతో డేటింగ్ చేసేదట. ఈ విషయాన్నీ ఆ అమ్మాయే తన టిక్ టాక్ ఖాతాలో చెప్పుకొచ్చింది. అయినా.. డేటింగ్ తో ఆకలి ఎలా తీరుతుంది..? అని సందేహం వస్తోందా.. అక్కడికే వెళ్దాం పదండి. అసలు విషయం ఏంటంటే.. డేటింగ్ పేరుతొ అబ్బాయిలు ఈమెని రెస్టారెంట్ కు తీసుకెళ్లేవారు.
ఈమె డేటింగ్ యాప్ లలో తన ప్రొఫైల్ ను అప్ డేట్ చేసి ఉంచేది. తనతో ఇంటరాక్ట్ అయిన వారితో మాట్లాడేది. వారు ఈమె గురించి మరింత తెలుసుకోవడం కోసం ఈమెను ఏదైనా హోటల్ కో, రెస్టారంట్ కో తీసుకెళ్లేవారు. అక్కడ వీరు చేసిన భోజనానికి అయ్యే ఖర్చుని కూడా వారే పెట్టుకునేవారు. అలా ఆమె తన ఆకలిని తీర్చుకునేదట. కాలేజీలో చదువుతున్న రోజులలో కడుపు నింపుకోవడం కోసం ఇలా చేసెదనని ఆమె టిక్ టాక్ లో చెప్పుకొచ్చింది. కొందరు క్రేజీ ఐడియా అంటూ కామెంట్స్ చేయగా.. మరికొందరేమో నమ్మించి మోసం చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేసారు. ఈ అమ్మాయి పై మీ అభిప్రాయం ఏంటి..? ఈ అమ్మాయి చేసింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా..?
End of Article