Ads
దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న గా మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం… గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే ఎందరో టాలెంట్ ఉన్నవాళ్ళని స్టార్స్ ని చేసింది.
Video Advertisement
అలా స్టార్ గా మారిన అమ్మాయే కీర్తి. కిట్టమ్మ అనే యూట్యూబ్ ఛానల్ లో కీర్తి తన వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. స్వతహాగా డాన్సర్ అయిన కీర్తి ఇప్పటికి తన యూట్యూబ్ ఛానల్ లో చాలా హిట్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేసి పోస్ట్ చేసింది. ఈమెకు యూట్యూబ్ లో లక్ష పన్నెండువేల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో 4 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తన స్నేహితులతో కలిసి కవర్ సాంగ్స్ చేసి ఎన్నో మిలియన్ల వ్యూస్ ని సంపాదించిన కీర్తి తాజాగా నాని నటించిన దసరా చిత్రం లోని ‘చమ్కీల అంగీలేసి..’ సాంగ్ కి రీల్ చెయ్యడం తో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగం గా హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ ‘చమ్కీల అంగీలేసి..’ సాంగ్ కి రీల్ చేయడం తో ఈ సాంగ్ ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.
ఇక కీర్తి కూడా అదే సాంగ్ కి రీల్ చేసారు. ఆ వీడియో లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఈమె కోసం నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేసారు. భరత నాట్యం డాన్సర్ అయిన కీర్తి అనేక సినిమా సాంగ్స్ ల కవర్ సాంగ్స్ తో పాటు.. తన భరత నాట్యానికి సంబంధించిన వీడియోలను కూడా తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
https://www.instagram.com/p/Cp9A4qcpRXD/
End of Article