Ads
ఎవరు ఎప్పుడు సెలబ్రిటీలుగా మారతారు తెలియని ప్రపంచం ఇది. సోషల్ మీడియా పుణ్యమా అని కొందరికి అమాంతంగా పేరు తెచ్చిపెడుతుంది.
Video Advertisement
హిట్ అయిన సినిమాలు డైలాగులుతో సన్నివేశాలతోనూ షార్ట్ వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొందరు ఫేమస్ అవుతా ఉంటారు. మామూలుగా వీడియోలు చూస్తే చూసే మనకి, స్టార్ హీరోలతో షార్ట్ వీడియోస్ అంటే కనులవిందే.
అలా స్టార్ హీరోలతో షార్ట్ వీడియోస్ చేస్తూ వాహ్వా అనిపించుకున్న వారిలో ఒకరు నిహారిక NM. ఈవిడ స్టార్ హీరోలతో చేసే షార్ట్ వీడియోస్ లో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు చూపులు చాలా ఫన్నీగా ఉంటూ నెటజన్లు ఆకర్షిస్తున్నాయి.
షాహిద్ కపూర్ జెర్సీ, అజయ్ దేవగన్ రన్ వే 34 విడుదలకు ముందు ఆవిడ చేసిన షార్ట్ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. రీసెంట్ గా యాష్ తో K. G. F 2 రిలీజ్ కి ముందు, సర్కారు వారి పాట రిలీజ్ కి ముందు మహేష్ తో చేసిన వీడియో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. మహేష్ దగ్గర తాళాల గుత్తి దొంగతనం చేస్తూ ఆవిడ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లు ఫిదా చేసేసింది.
మన మహేష్ బాబు, యష్ వంటి పెద్ద హీరోలతో వీడియోస్ చేస్తుందంటే ఆమె ఆమె స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఇవి పుట్టింది బెంగళూరు చదివింది కాలిఫోర్నియాలోని చప్మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ. తన చిన్నతనం నుంచి తమిళ సినిమాలు చూస్తూ పెరిగిన ఈ వీడియోలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఇంగ్లీషులో మాట్లాడినా మన సౌత్ వాసన కనిపిస్తోంది. అలా మాట్లాడడమే ఈ వీడియో లో హైలెట్ అని చెప్పవచ్చు. ఆ సౌత్ వాసనే ఈవిడ వీడియోలను ఫన్నీగా క్రియేట్ చేస్తున్నాయి.
End of Article