Ads
ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా కలుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. అయితే.. ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం అనేది ఒకప్పుడు అరుదు గానే ఉండేది. ఈ మధ్య ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ లవ్ స్టోరీ రూటు మాత్రం సెపరేటు.
Video Advertisement
ఎక్కడైనా ఎక్కువ గా అబ్బాయిలే లవ్ విషయం లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. తాము ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ తాజాగా.. బుధవారం సాయంత్రం ఝార్ఖండ్‌లోని సరాయకేలా ఛాండిల్ బజార్లో ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.
బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపైనే రచ్చ రచ్చ చేసారు. అయితే.. మరో యువకుడు, యువతీ ఆ అమ్మాయిలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే.. వారు మరింత గా గొడవ పడ్డారు. చాల కష్టం మీద వారిని విడతీసి, వారిద్దరికీ సర్ది చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. పోలీసులు అక్కడకి వచ్చేసరికే వీరిద్దరూ వెళ్లిపోయారు. అయితే.. ఈ అమ్మాయిలు ఎవరు అన్నదిమాత్రం తేలాల్సి ఉంది.
Watch Video:
https://www.youtube.com/watch?v=5v-qZv9kk8k
End of Article