Ads
జీవితం అంటేనే ఊహించని మలుపు. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పు సంభవిస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది సర్వసాధారణమైపోయింది.
Video Advertisement
కొన్ని ప్రేమ జంటలు విజయం సాధించి పెళ్లిపీటలు ఎక్కితే, మరికొన్ని జంటలు అనుకోని పరిస్థితులవల్ల ఒకరికి ఒకరు దూరం అయ్యి, నెమ్మదిగా గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ ఉన్నట్లుండి మన జీవితం లోకి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.
ఇప్పుడు అలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. ఈ సమస్యకు మీరే సరైన సమాధానం ఇవ్వగలరని భావిస్తున్నాను.
నేను కొంతకాలం ముందు ఒక వ్యక్తిని ఇష్టపడి ప్రేమించాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. తన పరిచయాన్ని, స్నేహాన్ని, ప్రేమను, అనుభూతులను మర్చిపోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ఆ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమయ్యాను.
తన జ్ఞాపకాలను పూర్తిగా నా ఊహలోంచి చెరిపేసిన తర్వాత మరొక మంచి వ్యక్తితో స్నేహం ఏర్పడింది. సరిగ్గా అప్పుడే నా మాజీ ప్రేమికురాలు మరలా నా జీవితంలోకి అడుగు పెట్టింది. తనకి ఇప్పుడు పెళ్లి అయిపోయింది.
కానీ తను నాతోనే స్నేహం చేయడానికి ఇప్పటికీ ఇష్టపడుతుంది. పైగా నువ్వు నన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు అని చెబుతోంది. తను విడిపోయిన తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పుల గురించి తనకు తెలియజేశాను. నేను ఇప్పుడు రిలేషన్ షిప్ లో ఉన్నాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అని నా జీవితంలో వచ్చిన మార్పు గురించి తనకి పూర్తిగా వివరించాను.
కాని తను నేను చెప్పిన ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఫోన్ కాల్స్ తో మరియు మెసేజులతో నన్ను ఎంతగానో డిస్టర్బ్ చేస్తుంది. ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలో మీరే నాకు సరైన సమాధానం ఇవ్వండి ప్లీజ్..
End of Article