Ads
గోదావరి సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ సినిమాలోని పాటలు, శేఖర్ కమ్ముల దర్శకత్వం, గోదావరి నది మీద పడవలో ప్రయాణం. ఈ సినిమా కమలినీ ముఖర్జీ కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కమలిని ముఖర్జీ పోషించిన సీత పాత్ర, ఆ పాత్రకి సింగర్ సునీత గారు ఇచ్చిన డబ్బింగ్ ఇప్పటికీ చాలా మంది మనసులో అలా ఉండిపోయింది.
Video Advertisement
ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు సీత అంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలని, వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి అని, ఓటమి వచ్చినా కూడా తమకు కావాల్సిన దాని కోసం ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ఆ పాత్ర ప్రేక్షకులను అంతగా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాలో సుమంత్, కమలిని ముఖర్జీ మాత్రమే కాకుండా గుర్తుండిపోయే ఇంకో వ్యక్తి నీతూ చంద్ర.
నీతూ చంద్ర గోదావరి సినిమాలో రాజీ పాత్ర పోషించారు. నీతూ చంద్ర పాట్నా లో పుట్టారు. నీతూ చంద్ర మొదటి సినిమా 2003లో వచ్చిన విష్ణు. ఈ సినిమాలో హీరో విష్ణు ఫ్రెండ్ గా నటించారు. ఆ తర్వాత గరం మసాలా అనే హిందీ సినిమాలో నటించారు ఆ తర్వాత గోదావరి, రాజశేఖర్ గారు హీరోగా నటించిన సత్యమేవ జయతే, మాధవన్ హీరోగా నటించిన 13 బి సినిమాల్లో నటించారు.
వీటితో పాటు ఎన్నో తెలుగు, హిందీ, తమిళ్ అలాగే కొన్ని కన్నడ, భోజ్ పురి, ఒక గ్రీక్ సినిమాల్లో నటించారు. ఒక భోజ్ పురి సినిమాని, ఒక మైథిలి భాష సినిమాని కూడా నిర్మించారు. నీతూ చంద్ర ప్రస్తుతం నెవర్ బ్యాక్ డౌన్ – రివాల్ట్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నారు. మళ్లీ ఒక మంచి పాత్రతో నీతూ చంద్ర తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.
End of Article