“అసాని” తుఫాన్ ధాటికి తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే?

“అసాని” తుఫాన్ ధాటికి తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే?

by Anudeep

Ads

ఆగ్నేయ బంగాళాఖాతం వైపు తుఫాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ మరింత బలపడింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది. ఈ తుఫాన్ తీవ్ర రూపాంతరం చెందిన కారణంగా తూర్పు తీర రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Video Advertisement

పశ్చిమ బంగాళాఖాతం మీద 25 కిమీ వేగంతో కాకినాడకు దక్షిణ ఆగ్నేయంలో 210 కి.మీ దూరంలో ఈ తుఫాన్ కదులుతోంది అని సమాచారం. దక్షిణ-నైరుతి దిశలో 310 కి.మీ, విశాఖపట్నం, గోపాల్పూర్ (ఒడిశా)కి నైరుతి దిశలో 530 కి.మీ దూరంలో ఈ తుఫాన్ కదులుతున్నట్లు గుర్తించారు.

golden charriot 1

ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లా సున్నాలపల్లి రేవు వద్ద ఓ అద్భుతం చోటు చేసుకుంది. సున్నాలపల్లి రేవు వద్ద తుఫాన్ ధాటికి ఓ బంగారు రధం తీరానికి కొట్టుకొచ్చిందట. మొదట దీనిని చూసిన స్థానికులు ఆందోళనకు గురి అయ్యారు. అయితే.. మందిరం లాంటి రథంలా కనిపించడంతో దానిని తాళ్లతో కట్టి ఒడ్డుకు లాక్కుని వచ్చారట. ఈ రథాన్ని చూడడానికి అక్కడి స్థానికులు ఎగబడుతున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో చెక్కి ఉందట.

golden charriot 2

థాయిలాండ్, మలేషియా లేదా జపాన్ వంటి దేశాలకు చెందిన రథం అయి ఉండొచ్చని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. గతంలో తితిలి లాంటి పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పటికీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఈ విచిత్రమైన మందిర రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుఫాన్ తీవ్రతరం కావడంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను పంపించారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తుఫాను కాకినాడ తీరానికి వచ్చిన తరువాత దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


End of Article

You may also like