కెనడాలో ఉండే ఇండియన్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.!

కెనడాలో ఉండే ఇండియన్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.!

by Anudeep

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించుకుని , ఎక్కడి వారు అక్కడ స్తంబించిపోయారు. మన దగ్గర కూడా స్కూల్స్, కాలేజీలు అన్ని మూతపడిపోయాయి. విద్యార్దులకు రావలసిన స్కాలర్ షిప్లు, ఫెలో షిప్లు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన నిత్యావసర సరుకులు, కొంత  డబ్బుతోనే కొన్ని వేల కుటుంబాలు బతకాల్సిన పరిస్థితి..ఇలాంటి పరిస్థితిలో కెనడా గవర్నమెంట్ ప్రకటించిన  ఆర్ధిక ప్యాకేజిలు ఆసక్తిగొలుపుతున్నాయి.

Video Advertisement

కరోనా తాకిడికి అతలాకుతలం అవుతున్న ప్రాంతాల్లో కెనడా కూడా ఒకటి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఇన్సెంటివ్స్(ఆర్దిక ప్యాకేజీలు ) ప్రకటించింది.. అవి  ముఖ్యంగా ఇళ్లకు దూరంగా ఉన్న మరియు తమ ఖర్చులను తామే సొంతంగా భరిస్తూ ఆందోళన చెందే స్టూడెంట్స్ ను కేంద్రంగా, వారికి మద్దతునిచ్చే విధంగా ప్రారంభించింది. కెనడా ఎమర్జెన్సీ స్టూడెంట్ బెనిఫిట్‌ : దీంట్లో భాగంగా స్టూడెంట్స్ కి మే నుండి ఆగస్టు వరకు 1250డాలర్లు స్టైపండ్ ఇవ్వాలని ప్రకటించింది. అంతేకాదు అంగవైకల్యం కలిగి ఉన్నవారికి, మరియు ఎవరైనా డిపెండెంట్ ఉంటే వారికి 1750డాలర్లుగా నిర్ణయించారు.

representative image source

కెనడా స్టూడెంట్ సర్వీస్ గ్రాంట్‌ : దీంట్లో భాగంగా అక్కడ స్టూడెంట్స్ ఈ వేసవికాలంలో కోవిడ్ -19 కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వాలంటీర్లుగా స్వచ్చందంగా పాల్గొనాల్సి ఉంటుంది. వారి సర్వీస్ కు గాను వారికి 5000డాలర్లను అందిస్తుంది.

representative image Source

అదే విధంగా ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వాలంటీర్లు అవసరం ఉంటుంది. అంతేకాకుండా వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం ఉంటుంది. అందుకోసం యువకులకు గాను 76000వేల ఉద్యోగాలను సిద్దం చేస్తుంది. అంతేకాకుండా రీసెర్చ్ స్కాలర్స్ యొక్క స్కాలర్ షిప్ లను , ఫెలోషిప్ లను 3-4నెలల వరకు పొడిగించాలని నిర్ణయించింది. అంతేకాదు 2020-2021 విద్యాసంవత్సరానికి గాను అందరి విద్యార్దులకు ప్రభుత్వం తరపున అందాల్సిన నిధులను రెట్టింపు చేయనున్నది.

ఇవన్నింటిని కేవలం కెనడా జాతీయులకే కాకుండా అక్కడ చదువుకుంటున్న అన్ని దేశాల స్టూడెంట్స్ కి అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్వదేశాలకు రాలేక అక్కడే చిక్కుకుపోయిన ఇతర దేశాల విద్యార్దులకు ,మన భారత విద్యార్దులకు కూడా ఊరట లభించినట్టే..


You may also like

Leave a Comment