Ads
- చిత్రం : ఓ కల,
- నటీనటులు : గౌరీష్ యేలేటి, రోష్ని సహోట, ప్రాచి టక్కర్,అలీ,
- నిర్మాత : నవ్య మహేశ్, రంజిత్ కుమార్ కొడాలి
- దర్శకత్వం : దీపక్ కొలిపాక
- సంగీతం : నీలేష్ మండలపు
- విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2023 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)స్టోరీ :
ఎంబిఎ పూర్తి చేసిన హారిక (రోష్ని)కు జాబ్ చేసే కన్నా, సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించి, వంద మందికి జాబ్స్ ఇవ్వాలని అనుకుంటుంది. దానికి ఆమె తండ్రి (దేవి ప్రసాద్) కూడా సహాయం చేస్తాడు. హారిక తన ఫ్రెండ్ శరణ్ తో కలిసి కంపెనీ మొదలుపెడుతుంది. కానీ శరణ్ మోసం చేయడంతో కంపెనీ నష్టాల్లో మునిగిపోతుంది,దాంతో ఆ కంపెనీ అమ్మేసి, డిప్రషన్ కు లోనై తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది. అప్పుడే హారిక లైఫ్ లోకి హర్ష (గౌరీష్ యేలేటి) వస్తాడు. జీవితం మీద ఆశ కోల్పోయిన హారికను హర్ష ఎలా సక్సెస్ ఫుల్ ఎంటర్ పెన్యూర్ గా మార్చాడు? అతని గతం ఏమిటనేదే తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.రివ్యూ :
Video Advertisement
దర్శకుడు దీపక్ కొలిపాక చిన్న పాయింట్ ను తీసుకుని మంచి దృశ్య కావ్యంగా తెరకెక్కించాడు. ఈమధ్యకాలంలో చాలా మంది డిప్రషన్ కు లోనై, ప్రాణం తీసుకుంటున్నారు. అయితే అలాంటి వారిలో చిన్న ఆశను సరి అయిన సమయంలో కలిగిస్తే, వాళ్ళకి తిరిగి వారి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
- ఎంచుకున్న కథ
- ఆర్టిస్టుల నటన
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- ఊహకందే క్లైమాక్స్
- స్లో నెరేషన్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మనసుకు హత్తుకునే చిత్రం.
watch trailer :
https://www.youtube.com/watch?v=J2BNzbYjWMA&pp=ygUGbyBrYWxh
End of Article