Ads
తెలుగు విలక్షణ నటుల్లో దగ్గుబాటి రానా ఒకరు. టాలీవుడ్ లో గొప్ప పేరున్న దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ, రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేశాడు. ‘బాహుబలి’ మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Video Advertisement
రానా దగ్గుబాటి తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించారు. పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’ లో రానా హిరణ్యకశిపుడిగా నటించబోతున్నారు. అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్‌లో రానా ‘హిరణ్యకశ్యప’ మూవీని ప్రకటించి, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే దీనిపై దర్శకుడు గుణశేఖర్ ట్వీట్ లో పరోక్షంగా రానా పై అసహనాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హిరణ్యకశ్యప సినిమాని రానా చేస్తాడని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా కామిక్ కాన్‍లో ఈ సినిమాని రానా ప్రకటించాడు. తన సొంత సంస్థలోనే ఈ సినిమాను రానా నిర్మించనున్నాడు. అమరచిత్ర కథ కామిక్స్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాయనున్నాడు. అయితే హిరణ్యకశ్యప మూవీని గుణశేఖర్ 2019లోనే ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు, హీరోగా రానాను ప్రకటించారు.
గుణశేఖర్ ఏళ్ల తరబడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేశారు. ఈ చిత్రం గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా రానా ప్రకటించడంతో గుణశేఖర్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఆ మూవీ గురించే అని అంటున్నారు. ట్వీట్ లో గుణశేఖర్, ‘దేవుడిని మీ స్టోరీకి ప్రధాన ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది’ అని రాసుకొచ్చాడు.గుణశేఖర్ ఇందులో ఎవరి పేరును వెల్లడించనప్పటికీ, రానా, త్రివిక్రమ్ లను లక్ష్యం చేశారని సమాచారం. తన కష్టాన్ని మరిచిపోయి ఆ సినిమాని వేరే వారికి అప్పగించిన రానా, ఈ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్న త్రివిక్రమ్ లకు నైతికత లేదని గుణశేఖర్ ఫీల్ అవుతున్నట్టు నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ రానా, త్రివిక్రమ్ లను తిడుతున్నారు.
Also Read: ఇంత మంచి హీరో “కార్ డ్రైవర్” గా ఎందుకు మారాల్సి వచ్చింది..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
End of Article