మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీ స్టోరీ లీక్..

మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీ స్టోరీ లీక్..

by Sainath Gopi

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ గురించిన వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి. మూవీ టైటిల్ విషయంలో అయితే ఏ సినిమాకు కానంత గందరగోళం ఏర్పడింది.

Video Advertisement

ఈ మూవీ కోసం పలు పేర్లు వినిపించాయి. ఫైనల్ గా గుంటూరు కారం ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల నుండి ఈ మూవీ గురించి రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, తమన్ లను ఈ మూవీ నుండి తొలగించారని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ కథ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
guntur-karam-movieమహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ తరువాత ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. ఈ మూవీ పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో మూవీని అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ చాలా అడ్డంకుల మధ్య జనవరిలో ప్రారంభం అయ్యింది. అయితే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత వాయిదా పడింది. మళ్ళీ ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టి ఒక నెల షూటింగ్ జరగగానే మళ్ళీ విరామం తీసుకున్నారు.
trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!‘గుంటూరు కారం’ మూవీని త్రివిక్రమ్ మాస్ మసాలా స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక మూవీ గురించి తరచూ ఏదో ఒక వార్త  వైరల్ గా మారుతోంది. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయినట్టు ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వైరల్ అయిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని, అయితే ఇద్దరి తండ్రి ఒక్కరే, కానీ తల్లులు వేరని తెలుస్తోంది.
దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంటుందని, వీరిద్దరి మధ్య మహేష్ బాబు క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుందని, త్రివిక్రమ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ను సైతం బలంగా చూపిస్తారని తెలుస్తోంది.

Also Read: “బ్రో” మూవీలో తన పాత్ర కోసం… “పవన్ కళ్యాణ్” ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారా..?

 


End of Article

You may also like