ఆ షాప్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది..అందులో అంత స్పెషల్ ఏంటి?

ఆ షాప్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది..అందులో అంత స్పెషల్ ఏంటి?

by Anudeep

Ads

వారసులంటే కేవలం కొడుకులు మాత్రమే..మన కడుపున పుట్టిన ఆడబిడ్డలెప్పుడూ “ఆడ” బిడ్డలే.. ఒక ఇంటికి పోయేవాళ్లని ఎప్పుడూ  కూడా వారసులుగా అంగీకరించదు ఈ సమాజం..అందుకే తమ తదనంతరం వ్యాపారాలైనా,ఆస్తులైనా కొడుకులకే వర్తిస్తుంటాయి..కూతుర్లకు కూడా వాటా ఉందని చట్టాలు చెప్పినా పట్టించుకునే వారు తక్కువ.. కానీ పంజాబ్ లోని ఒక మెడికల్ షాపు యాజమాని ఆలోచన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Video Advertisement

మీరెప్పుడైనా ఏదైనా వ్యాపారాలకు సంబంధించినా , లేదంటే దుఖాణాలకు సంబంధించినా ఆయా పేర్లకు తోడుగా బ్రదర్స్, లేదంటే సన్స్ అని యాడ్ చేసి ఉండడాన్ని గమనించే ఉంటారు. కానీ పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ మెడికల్ షాపు యజమాని…తన మెడికల్ షాపుకు “గుప్తా అండ్ డాటర్స్”  అని పేరు పెట్టుకున్నాడు..తన కూతుళ్లే తన వారసులని తెలియచేసేలా పెట్టించిన ఆ సైన్ బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

డాక్టర్ అమన్ కశ్యప్ “గుప్తా అండ్ డాటర్స్” పేరిట ఉన్న ఈ సైన్ బోర్డును మొదట తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కొడుకుల పేర్ల మీద తెరిచిన షాపుల మాదిరిగా కాకుండా..గుప్తా అండ్ డాటర్స్ పేరిట ఉన్ మెడికల్ షాపు సైన్ బోర్డు లుథియానాలో కనిపించిందని, ఈ ప్రపంచంలో మీరు చూడాలని అనుకున్న మార్పును చూడండి అని ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు అమన్.. పోస్టు చేసిన క్షణాల్లోనే వేలల్లో శేర్లు.. ఆ గుప్తా ఎవరో తెలియకపోయినా అతడికి ప్రశంసలు లభించాయి..

తన బిడ్డలకు ఆ తండ్రి ఇచ్చిన ప్రాముఖ్యతను నెటిజన్లందరూ ప్రశంసిస్తున్నారు. కొత్త శకానికి ఆరంభం అని కొందరు, వేరే పేరు చూడడం సంతోషంగా ఉందని మరో నెటిజన్.. నేను ఇదే ఆలోచన చెప్తే నా తండ్రి అంగీకరించలేదు..ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తానని ఒక నెటిజన్ ఇలా  ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ.. ఆ మార్పు అనేది మన నుండే ఎందుకు రాకూడదూ అనే ఆలోచన వస్తే సమాజంలో తారతమ్యాలనేవి ఉండవు… మారడానికి సమయం పట్టొచ్చు కానీ  మార్పు సహజం..ఆ మార్పు మొదట్లో కొత్తగా ఉంటుంది..తిరస్కరించబడుతుంది.కానీ చివరికి అంగీకరించి తీరాల్సిందే..


End of Article

You may also like