Home Filmy Adda కాబోయే భర్త మొదటి పెళ్ళిలో… హన్సిక హంగామా..! వైరల్ అవుతున్న వీడియో..!!

కాబోయే భర్త మొదటి పెళ్ళిలో… హన్సిక హంగామా..! వైరల్ అవుతున్న వీడియో..!!

by Anudeep

గత కొన్నిరోజులుగా యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పై చాలా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంది ఈ భామ.

హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు సోహైల్ కతూరియా. ఇతడు ముంబై కి చెందిన వ్యాపారవేత్త. అవంతే టెక్స్ వరల్డ్ అనే టెక్స్టైల్ కంపెనీ కి సోహైల్ యజమాని. కాగా హన్సిక కాబోయే భర్త బిజినెస్ స్ట్రాటజీస్లో మంచి గ్రిప్ ఉన్న మనిషి అని.. వ్యాపారంలో నెంబర్ వన్ మైండ్ సెట్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. దాదాపు ఏడు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెల్సిందే.

hansika attended her fiance first marriage
అయితే హానిక కాబోయే భర్త సోహైల్ కి ఇది రెండో పెళ్లి అన్న విషయం చాలా మందికి తెలీదు. అతడికి 2016 లో రింకీ అనే ఆమె తో పెళ్లి అయింది. ఆమె హన్సిక కి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో హన్సిక ఆ పెళ్లి కి హాజరైంది.

hansika attended her fiance first marriage

గోవా లో జరిగిన ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఎంతో సంతోషంగా హన్సిక ఆ పెళ్ళికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.

hansika attended her fiance first marriage
మరోవైపు హన్సిక- సోహైల్ వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తుంది. వివాహానికి జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ వేదికగా మారనుంది. వేడుకకు వచ్చే అతిథుల కోసం హోటల్‌లోని అన్ని గదులు, సూట్స్‌ను ఇప్పటికే బుక్ చేశారు.

 

You may also like