Ads
హనుమాన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమాను చూసిన బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ ప్రకారం హనుమాన్ సినిమా బాగుందని, ఫ్యాసినేటింగ్ అంటూ మూడున్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు.
Video Advertisement
సినిమాలో తేజ సజ్జ హీరోగా అదరగొట్టేసారని గూస్ బంప్స్ మూమెంట్స్ మూవీ లో చాలా ఉన్నాయి. వి ఎఫ్ ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. మొదటి భాగంలో కొన్ని సీన్స్ కొంచెం సాగదీతగా అనిపించినా స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాని అమాంతం పైకి లేపేసాయి.
క్లైమాక్స్ అసాధారణ రీతిలో అద్భుతంగా ముగించారు. హనుమాన్ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ ని రూపొందించారు హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. పురాణాలు ఆధారంగా డ్రామా భావోద్వేగాలు వి ఎఫ్ ఎక్స్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు అని చెప్పుకొచ్చారు. అలాగే హనుమాన్ చిత్రాన్ని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు కూడా చూడడం జరిగింది.
వాళ్లు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి హనుమంతు అనే కుర్రాడు హనుమంతుని అనుగ్రహంతో పుడితే అతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది మెయిన్ కథగా చెప్పుకోవాలి. హనుమాన్ ఫస్టాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఇంకొక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.
హనుమంతుడు ప్రత్యక్షమైనప్పుడు స్టన్ అయిపోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు తెలియకుండానే చెప్పులు తీసి పక్కన పెట్టి తమ భక్తిని చాటుకుంటారని సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న సినిమా నలిగిపోతుందేమో అనే సింపతీ కూడా హనుమాన్ సినిమాకి ప్లస్ అయ్యింది అంటున్నారు. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ కూడా అందర్నీ మెస్మరైజ్ చేసి సినిమాకి మరింత హైప్ ని తీసుకువచ్చాయి.
End of Article