హనుమాన్ మూవీకి రోజురోజుకీ పెరుగుతున్న క్రేజ్…!

హనుమాన్ మూవీకి రోజురోజుకీ పెరుగుతున్న క్రేజ్…!

by Mounika Singaluri

Ads

రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ పోటీ నెలకొంది. పెద్దపెద్ద సినిమాలోని సంక్రాంతికి పోటాపోటీగా వస్తున్నాయి. అయితే ఈ పెద్ద సినిమాలు నడుమ చిన్న సినిమాకు హనుమాన్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ముందు నుండి కూడా హనుమాన్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.

Video Advertisement

హనుమాన్ ట్రైలర్ విడుదలయ్యాక బాగా పెరిగిపోయాయి. హనుమాన్ మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సంక్రాంతికి ముందుగా డేట్ అనౌన్స్ చేసింది హనుమాన్ మూవీ టీం మాత్రమే.

అయితే తాజాగా బుక్ మై షో ఒక రిపోర్టు విడుదల చేసింది. సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఏ సినిమా కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు అంటూ ఈ రిపోర్టులో ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా హనుమాన్ మూవీ కి మంచి రిపోర్ట్ వచ్చింది.గుంటూరు కారం మూవీ పట్ల 101కె ఆడియన్ ఆసక్తి చూపించారు. దీని తర్వాత రెండో స్థానంలో హనుమాన్ మూవీ 68 కె ఇంట్రస్ట్స్ తో ఉండటం విశేషం. నెక్స్ట్ నా సామి రంగా మూవీని 18.4 కె మంది చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 

సైంధవ్ మూవీని 9.8 వేల మంది మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండగా రవితేజ ఈగల్ కి అయితే 8.4వేల మంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇంట్రస్ట్స్ పెట్టారు. వీటిలో గుంటూరు కారం హనుమాన్ జనవరి 12 న విడుదల కానున్నాయి. రవితేజ ఈగల్ జనవరి 13న ప్రకటించారు.వెంకటేష్ సైంధువ్ కూడా జనవరి 13 న రానుంది.ఇంకా నాగార్జున నా సామి రంగ అయితే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.


End of Article

You may also like