HANUMAN vs GUNTUR KARAM: అప్పుడు మహేష్ కొడుకుగా నటించాడు…ఇప్పుడు మహేష్ కి పోటీగా సినిమా.!

HANUMAN vs GUNTUR KARAM: అప్పుడు మహేష్ కొడుకుగా నటించాడు…ఇప్పుడు మహేష్ కి పోటీగా సినిమా.!

by Harika

Ads

సంక్రాంతికి ఏకంగా 5 చిత్రాలు విడుదలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. నాలుగు స్టార్ హీరోల సినిమాలు ఉండగా, ఒకటి యంగ్ హీరో మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ కి పోటీగా హనుమాన్ రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమాన్ లో హీరోగా చేస్తున్న తేజ…ఒకప్పుడు యువరాజులో మహేష్ కుమారుడిగా నటించాడు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మహేష్ తో పోటీ పడుతున్నాడు..

Video Advertisement

మహేష్ నటిస్తున్న గుంటూరు కారం మూవీ ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కొందరు మూవీని నుండి తప్పుకోవడం, పలుమార్లు షూటింగ్ వాయిదా పడడంతో మూవీ పై ఫ్యాన్స్ కూడా ఆశలు వాడులుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, మహేష్ లుక్ ఈ చిత్రం పై అంచనాలను పెంచింది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. అదే రోజు ప్రశాంత్ వర్మ దర్శకటవంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ రిలీజ్ కానుంది. దీంతో ఈ మహేష్, తేజ గురించిన వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.


మహేష్ బాబు హీరోగా నటించిన రెండవ చిత్రం యువరాజు. ఈ మూవీలో మహేష్ కొడుకుగా తేజ సజ్జ నటించాడు. తేజ పలు చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు హీరోగా మారిన తేజ మహేష్ కు పోటీగా వస్తున్నాడు అని పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. వీటి పై తేజ సజ్జ స్పందిస్తూ, సూపర్ స్టార్ తో పోటీ ఏంటి, ఆయనతో పోటీగా కాదు. ఆయనతో పాటుగా అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు.


End of Article

You may also like