Ads
హుజురాబాద్ ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది..అధికార తెరాస మరియు బీజేపీ ల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది..ఇవాళ హరీష్ రావు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాకేందర్ పైన అలాగే కేంద్ర ప్రభత్వం పైన పలు విమర్శలు చేసారు..
Video Advertisement
గతం లో తెలంగాణ సీఎం కెసిఆర్ రాష్ట్రం కోసం రాజీనామా చేసారని అయితే ఇప్పుడు ఈటెల ఎందుకు రాజీనామా చేసారో చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ తెరాస మద్యేనని తేల్చేసారు.. ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న ఈటెల అసలు ఏమి చెయ్యలేదని అలాంటిది ప్రతిపక్షం లో ఉంది గెలిస్తే ఇంకా ఎలా అభివృద్ధి చేస్తారని ఈ సందర్బంగా హుజురాబాద్ ప్రజలకి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి కనీసం డిపాజిట్ కూడా దక్కదని ఈ సందర్బంగా అన్నారు అంతే కాదు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ బీజేపీ ఉంటె ప్రజలకి అచ్చే దిన్ కాదు సచ్చే దిన్ అంటూ మండిపడ్డారు. ప్రభత్వ ఆస్తులని ప్రైవేటీకరణ చెయ్యడం తప్ప ఏనాడైనా అభివృద్ధి చేసారా అంటూ మండిపడ్డారు.
End of Article