ఆ న్యూస్ ఛానెల్ ని తగులుకున్న హరీష్ శంకర్.. కామెంట్స్ లో ఇచ్చి పడేస్తున్నారు..!

ఆ న్యూస్ ఛానెల్ ని తగులుకున్న హరీష్ శంకర్.. కామెంట్స్ లో ఇచ్చి పడేస్తున్నారు..!

by Anudeep

ఇటీవల న్యూస్ చానెల్స్ వెబ్ సైట్ లలో వచ్చే వార్తలు ఇబ్బందికరం గా ఉంటున్నాయి. అందులో వాస్తవాలు ఏంటో తెలిసి తెలియకుండానే చిలవలు పలవలు చేసేసి రాస్తున్నారు. వీటిని ఎక్కువ గా సెలెబ్రిటీలే ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు సమంత ఫ్యామిలీ సమస్య అయినా, మొన్న సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ గురించి అయినా వెబ్ సైట్ లలో వచ్చిన కధనాలు అన్నీ ఇన్నీ కావు.

Video Advertisement

harish sankar

వీటిపై దర్శకుడు హరీష్ శంకర్ మొన్నామధ్య ఘాటు గానే స్పందించారు. సాయిధరమ్ తేజ్ కు ఆక్సిడెంట్ అయిన సమయం లో కూడా.. హాస్పిటల్ బెడ్ పై ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీపై తప్పుడు వార్తలు రాసేవారికి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నా అంటూ స్టేటస్ పెట్టారు. తాజాగా.. ఓ టివి ఛానెల్ పోస్ట్ చేసిన మరో ఆర్టికల్ ని కూడా కూడా షేర్ చేసి లాఫింగ్ ఎమోజి ని పెట్టారు. ఆ పోస్ట్ కింద హరీష్ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.


You may also like