సీరియల్ నటి శ్రీవాణిని అలా చూసేసరికి కంటతడి పెట్టుకున్న హరిత…వైరల్ అవుతున్న వీడియో.!

సీరియల్ నటి శ్రీవాణిని అలా చూసేసరికి కంటతడి పెట్టుకున్న హరిత…వైరల్ అవుతున్న వీడియో.!

by Anudeep

Ads

సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో బుల్లితెర నటీమణులు ఒక వైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా మరోవైపు తమకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారి జీవనశైలికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ చానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
ఈ విధంగా వారి తమ అభిమానులకు దగ్గరైనట్టు భావిస్తారు. అయితే తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బుల్లితెర సీనియర్ నటి అయిన హరిత వరలక్ష్మీ వ్రతం వేడుకను తన ఇంట్లో ఎంతో ఘనంగా జరుపుకుంది.

Video Advertisement

హరిత ఇంట్లో జరిగిన వరలక్ష్మీ వ్రతానికి తెలుగు సీరియల్స్ కు సంబంధించిన ఎందరో టాప్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో హరిత తన ఇంట్లో జరిగిన వరలక్ష్మీ వ్రత విధానాన్ని మొత్తం వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

అందరితో పాటు ఆ వ్రతానికి శ్రీవాణి తన కుమార్తెతో సహా వచ్చారు. శ్రీవాణి ప్రస్తుతం శతమానం భవతి సీరియల్ లో అత్త పాత్రలో నటిస్తున్నారు. శ్రీవాణి చూసిన వెంటనే హరిత ఒక్కసారి ఎమోషనల్ గా బర్స్ట్ అయ్యి అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడవద్దు అని శ్రీవాణి ఎంతసేపు సైగ చేసిన హరిత మాత్రం ఎడతెరిపి లేకుండా కంటతడి పెట్టుకున్నారు.

Also read: గత కొన్ని రోజుల నుండి సీరియల్ నటి “శ్రీవాణి” గొంతు వినిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

నటి శ్రీవాణి గత కొంతకాలం నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమెకు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, కనీసం ఒక నెల రోజుల పాటు అయినా ఆమె మాట్లాడకుండా ఉండడం చాలా అవసరం అని అలా చేస్తేనే ఆమెకు తిరిగి మాట వస్తుందని లేకపోతే జీవితాంతం మాట్లాడే అవకాశాన్ని కోల్పోవచ్చు అని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి శ్రీవాణి అందరితో కేవలం సైగల ద్వారానే కమ్యూనికేట్ అవుతూ మౌనం పాటిస్తూ ఉన్నారు.

శ్రీవాణి హెల్త్ కి సంబంధించిన ఈ విషయాన్ని ఆమె భర్త విక్రమ్ ఒక వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు. ఆ వీడియో చూసి హరిత ఎంతో బాధపడ్డారట, ఇప్పుడు స్వయంగా ఆమె ఎదురుగా చూసేసరికి బాధ తట్టుకోలేని హరిత కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీవాణి హెల్త్ గురించి హరిత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అయ్యింది.

watch video:


End of Article

You may also like