Ads
నటి స్వక్ష గణేష్ అయ్యర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హాట్సన్ కర్డ్ యాడ్ లో కనిపించిన పాప అంటే గుర్తుపడతారు. ఆమెను బేబీ స్వక్ష అని కూడా పిలుస్తారు.
Video Advertisement
స్వక్ష అయ్యర్ తమిళనాడులో జన్మించింది. 2017 లో వచ్చిన ఈ ప్రకటనలో చిన్నగా ఉన్న ఈ అమ్మయి ఇప్పుడు పెద్దగా అయ్యింది. ప్రకటనలలో మరియు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే బేబీ స్వక్ష ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
తమిళనాడులో జన్మించిన స్వక్ష అయ్యర్ చిన్నప్పటి నుండే ప్రకటనలలో, సినిమాలలో ను బాలనటిగా రాణించింది. ఆమె ఇప్పటివరకు 130 కి పైగా ప్రకటనల్లో నటించింది. అంతేకాకుండా కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్ లో పలు సినిమాలలో నటించింది. స్వక్ష మొదట టెలివిజన్ ప్రకటనలలో నటించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనలలో నటించిన తర్వాత, ఆమె మొదటి సారిగా 2013లో కళ్యాణ సమయ సాధన అనే సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
స్వక్ష అయ్యర్ 2016 లో తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుకు దుద్దులో బాలనటిగా కీలక పాత్రను పోషించింది. ఇందులో స్వక్ష హీరోయిన్ చిన్నప్పటి పాత్రను పోషించింది. ఆ తరువాత 2017 లో విడుదలైన నిబునన్ అనే సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా నటించింది. ఈ సినిమాలో హీరో ప్రసన్న, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు సుహాసిని నటించారు. ఈ మూవీ తెలుగులో కురుక్షేత్రం పేరుతో రిలీజ్ అయ్యింది. అదే ఏడాది స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నటించిన ‘సాంగు చక్రం’ అనే సినిమాలో స్వక్ష నటించింది.
స్వక్ష అనేక టీవీ కమర్షియల్ ప్రకటనలలో నటించింది. హై-ప్రొఫైల్ బ్రాండ్‌లను ఆమోదించింది. హాట్సన్ పెరుగు, కోల్గేట్ టూత్ పేస్ట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఉదయకృష్ణ నెయ్యి వంటి 130 యాడ్స్ పైగా నటించింది. ప్రస్తుతం మోడెల్, నటిగా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్వక్ష అయ్యర్ కి ఇంస్టాగ్రామ్ లో 217 ఫాలోవర్స్ ఉన్నారు.
End of Article