స్కంద… SVSC..! ఈ 2 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనించారా..?

స్కంద… SVSC..! ఈ 2 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనించారా..?

by kavitha

Ads

రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ “స్కంద”. ఈ చిత్రం సెప్టెంబర్ 28న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Video Advertisement

ఈ మూవీని సోషల్ మీడియాలో నెటిజెన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఏదో ఒకరకంగా నెట్టింట్లో స్కంద పేరు వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు కామన్ పాయింట్ ఉందని తెలుస్తోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే బోయపాటి శ్రీను అని అంటారు. బోయపాటి ఇప్పటి దాకా 9 చిత్రాలు మాస్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇక స్కంద సినిమాను వాటికి మించిన మాస్ తో తెరకెక్కించాడు. ఇక బోయపాటి చిత్రాలలో లాజిక్ లు ఉండవు. హీరో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నవారి నైన సులభంగా కొట్టగలడు. ఇక స్కందలో అయితే 2 అడుగులు ముందుకేశాడని అంటున్నారు.
skanda movie review ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కి మాస్‌ ప్రేక్షకులు ఈలలు వేస్తే, సాధారణ ఆడియెన్స్ కు మాత్రం చాలా సిల్లీగా అనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీని నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. రీలిజ్ అయినప్పటి నుండి ఈ మూవీ నెట్టింట్లో ఏదో ఒక విధంగా హల్చల్ చేస్తూనే ఉంది. స్కంద లాంటి మాస్ సినిమాకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాకు కామన్ పాయింట్ ఉంది.
తాజాగా కోతిమీర.కట్ట అనే ఇన్ స్టా ఖాతాలో స్కంద మూవీలోని రామ్, శ్రీలీల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వెంకటేష్, మహేష్ బాబు ఫోటోలను షేర్ చేస్తూ, ‘కాస్త వీళ్ళ పేర్లు ఏంటో చెప్పండయ్యా’ అంటూ పోస్ట్ చేశారు. ఆ మూవీలో వెంకటేష్, మహేష్ బాబును పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తారు. ఇక స్కంద మూవీలో రామ్ ని సీఎం అల్లుడు, శ్రీలీల సీఎం కూతురు, యావరేజ్ అని పిలిచినట్టు తెలుస్తోంది. రెండు సినిమాలలో మెయిన్ క్యారెక్టర్లకు పేర్లు లేవు. ఇక ఈ పోస్ట్ పై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/Cxzue5gJNQE/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ నటుడు ఎవరో తెలుసా? మూడు నెలల పాటు విదేశాల్లో.?

 


End of Article

You may also like