రవితేజ “దరువు” సినిమాలో ఈ సీన్ చూశారా..? ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?

రవితేజ “దరువు” సినిమాలో ఈ సీన్ చూశారా..? ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా మొదలయినప్పటి నుండి పలు రకాలుగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ, రిలీజ్ అయ్యాక నెట్టింట్లో విపరీతమైన నెగెటివిటీ, ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది.

Video Advertisement

ఎక్కువ ట్రోల్స్, విమర్శలు వస్తున్నది మాత్రం ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే. మూవీలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, నాలుగు కామెడీ సీన్స్, ఫైట్లు రాసుకుని మూవీ తెరకెక్కించాడాని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రవితేజ మూవీలోని సీన్ కాపీ చేసారంటూ ఓ సీన్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ, మొదటి నుండి ఆటంకాలు, ఆ తరువాత హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం, పలు రకాల ప్రచారాలు వచ్చాయి. ఓ దశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
comments on guntur kaaram sceneఆ సినిమా కాపీ అంటూ కొందరు, ఆ నవల కాపీ అంటూ మరికొందరు నెట్టింట్లో ఈ మూవీ పై విమర్శలు చేశారు. థియేటర్ల విషయంలోనూ వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి విమర్శల మధ్యనే మూవీ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో నెగెటివిటీ మొదలైంది. బుక్ మై షో యాప్ లో మూవీ రిలీజ్ కాకముందే 70 వేల మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే మహేష్ బాబు వల్లే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.
తాజాగా రవితేజ నటించిన దరువు మూవీలోని సీన్ ను త్రివిక్రమ్ కాపీ చేశారని, అదే సీన్ ను గుంటూరుకారంలో మహేష్ బాబుతో చేశారంటూ దరువు సీన్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నిజమే అంటుండగా, కొందరు అదేం కాదని అంటున్నారు.

https://www.instagram.com/reel/C2Es4FFrM21/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ఇలాంటి పాట టాలీవుడ్ లో రాదేమో..! దీని ప్రత్యేకత ఏంటంటే..?


End of Article

You may also like