అంబానీ కంటే రిచ్…కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో…పతనానికి కారణం ఏంటంటే.?

అంబానీ కంటే రిచ్…కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో…పతనానికి కారణం ఏంటంటే.?

by Mounika Singaluri

Ads

భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్‌ అనేది ఒక టాప్ బ్రాండ్‌. ఆ సంస్థకు ఆ ఇమేజ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్‌ టెక్స్‌టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేది లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. “ది కంప్లీట్ మ్యాన్”, “ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్‌” ట్యాగ్‌లైన్‌లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే.

Video Advertisement

అయితే కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపరం కుటుంబం రేమాండ్‌ గ్రూప్.ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో అంబానీలను మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు.

విజయ్‌పథ్‌ కొడుకు గౌతమ్ సింఘానియాతో విబేధాల వల్ల ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో చాలా కష్టాలు పడుతున్నారు.1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమైన రేమండ్‌ ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.విజయ్‌పత్‌ పెద్ద కొడుకు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్‌లో స్థిరపడ్డాడు. రేమాండ్‌ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్‌తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది.

సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్‌పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.గౌతమ్‌ భార్య నవాజ్‌మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది.గౌతమ్ తనను హింసించాడని ఆరోపించి, గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్‌ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్‌ చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్‌కు బదులుగా నవాజ్‌కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం.

రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్‌ స్టాక్‌గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది.మానవ సంబంధాలు, కుటుంబంలోని వివాదాల దుష్పరిణామాలకు రేమండ్‌ వ్యవహారం, ఒక రిమైండర్‌ లాంటిది.

Also Read:వర్మ చనిపోయాక ఆయన విలువ తెలుసుకుంటాం… వర్మ శిష్యుడు కామెంట్స్ వైరల్…!


End of Article

You may also like