Ads
ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం, రకరకాలుగా శిక్షించడం, వాటికి తట్టుకోలేని పిల్లలు చనిపోవడం, లేదా ఉపాధ్యాయులు వేధించడం వల్ల కొందరు పిల్లలు ప్రాణాలు తీసుకోవడం తరచూ వార్తల్లో వినడం, చూడడం జరుగుతూనే ఉంది.
Video Advertisement
అయితే ఇలాంటి తరుణంలో ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ స్కూల్ కు రాని స్టూడెంట్స్ ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను బ్రతిమిలాడాడు. చదువుకోమని మోకాళ్ళ పై కూర్చుని ఓ స్టూడెంట్ కి చేతులెత్తి దండం పెట్టి చెప్పాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఈ సంఘటన 2018 లో ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హెడ్ మాస్టర్ పేరు డి బాలు. తమిళనాడులోని విల్లుపురంలో మునిసిపల్ సెకండరీ పాఠశాలకు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు ఆ ప్రాంతంలోని విద్యార్థులు హాజరుకాకపోవడం అనేది అక్కడ చాలా సాధారణ విషయం. దాంతో విద్యార్థులు పాఠశాలకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, అక్కడ ఉన్న కట్టుబాటును మార్చాలని డి బాలు నిర్ణయించుకున్నారు.
ఆ హెడ్ మాస్టర్ వయసు 56 ఏళ్ళు , ఆయన గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేక పాఠశాల మానేసిన పిల్లలు, పాఠశాలకు హాజరు కానీ విద్యార్థులు, చదువును నిర్లక్ష్యం చేసే విద్యార్థుల ఇళ్ళకు ఆ హెడ్ మాస్టర్ ప్రతిరోజూ వెళతాడు. విద్యార్థుల తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలకు పంపించమని వారిని అభ్యర్థిస్తాడు. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం లేదు. దాంతో బాలు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి చదువుకోమని వేడుకుంటున్నాడు.
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బాగా చదువుకుని జీవితంలో పురోగతి సాధించాలని చెప్తూ బతిమిలాడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఫ్యూచర్ కోసం ఈ హెడ్ మాస్టర్ గారు చేస్తున్న పనికి నెటిజెన్లు అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.
Also Read: సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
End of Article