Home Filmy Adda స్టార్ యాంకర్ సుమ కి అనారోగ్య సమస్యలు .. ఇన్ని రోజులుగా దాచిపెట్టిన స్టార్ యాంకర్

స్టార్ యాంకర్ సుమ కి అనారోగ్య సమస్యలు .. ఇన్ని రోజులుగా దాచిపెట్టిన స్టార్ యాంకర్

by Sunku Sravan

ఒక స్టార్ హీరో సినిమా కి సంబంధించి ఈవెంట్ అయినా, చిన్న హీరో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. అటు బడా ఈవెంట్ల నుంచి మొదలు కొని బుల్లితెర పై షోల వరకు సుమ కనకాల ఉంటారు. ఆమె షెడ్యూల్ లో ఒక రోజు కూడా తీరిక లేకుండా ఉంటారు. గత కొన్నేళ్లుగా యాంకరింగ్ లో ఆమె క్వీన్. హీరోయిన్స్, హీరోలు కూడా కొంత అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు.

suma-kanakaala-health-issues

suma-kanakaala-health-issues

వారి బిజీ షెడ్యూల్ వలన కావచ్చు, పని వత్తిడి వలననో, దీర్ఘకాలిక సమస్యసల వలనో మరే ఇతర కారణాల వలనననో కొందరు నిర్మొహమాటంగా బయటికి చెబుతుంటే. మరికొందరు బయటకి చెప్పుకోలేని వారు ఉంటారు. అలాగే యాంకర్ సుమ కూడా ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకున్న సమస్య గురించి చెప్పారు.

anchor suma images

anchor suma images

తనకొక చర్మ సంబంధిత సమస్య ఉందని కీలాయిడ్‌ టెండెన్సీ అనే ప్రాబ్లెమ్ తో చాల ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఈ సమస్య ఏంటి అంటే ఏదైయిన ఒక గాయం కూడా పెద్దగా మారుతుందట. ఆ గాయం త్వరగా మానిపోదట.. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదని చివరికి శరీరం లో అదొక భాగం అయ్యిందని చెప్పారు. తన కెరీర్ మొదట్లో చేరిన పొరపాట్లు వలన సమస్య తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తీసివేయాలి అని తనకు మొదట తెలిసేది కాదట.

ఇవి కూడా చదవండి: “సుమ” సక్సెస్ వెనకున్న ఈ కథ గురించి మీకు తెలుసా.? సుమ తల్లిగారు చెప్పిన విషయాలివే.!

You may also like