ఫుడ్ డెలివరీ చేయడానికి తన భార్యని కూడా తీసుకెళ్తాడు..? కంటతడి పెట్టిస్తున్న వీరి కథ..!

ఫుడ్ డెలివరీ చేయడానికి తన భార్యని కూడా తీసుకెళ్తాడు..? కంటతడి పెట్టిస్తున్న వీరి కథ..!

by kavitha

Ads

గుజరాత్ రాష్ట్రానికి చెందిన కేతన్ రజ్‌వీర్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్నారు. అయితే అతను ఫుడ్ డెలివరీ అందించేచేయడానికి వెళ్ళే ప్రతిచోటికీ తన భార్యను కూడా తీసుకు వెళ్తుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇది నిజమే. ఆ డెలివరీ బాయ్‌ అలా చేయడం వెనుక బలమైన కారణం ఉంది. వివరాల్లోకి వెళ్తే,

Video Advertisement

గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో జీవించే కేతన్ రజ్‌వీర్ భాయ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. అతని భార్య సోనాల్  క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతోంది. భార్య ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ప్రతికూల ఆలోచనలతో బాధ పడకుండా ఉండేందుకు తనతో తీసుకెళ్తుంటాడు. అలా కేతన్ ప్రతి రోజూ భార్య సోనాల్‌ను ఫుడ్ డెలివరీ కోసం వెళ్ళినప్పుడు బైక్‌ పై తీసుకెళ్తాడు. సోనాల్ ప్రస్తుతం క్యాన్సర్ నాలుగో స్టేజ్ లో ఉంది. ఇప్పటి వరకు ఆమెకు ఎనిమిది సార్లు కీమోథెరపీ చికిత్స చేశారు.Food-Delivery-with-Wife3సోనాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికి కేతన్ రజ్‌వీర్ ధైర్యం కోల్పోకుండా, భార్యను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా తనతోనే తీసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. వీరిని చూసినవారు అడిగినపుడు, అతను తన భార్య ఆరోగ్య పరిస్థితిని, సమస్యను చెబుతుంటాడు. కేతన్ కు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరు.
కేతన్‌, సోనాల్‌ 2007లో వివాహం చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమెకు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడింది. సోనాల్‌ విపరీతమైన చెస్ట్ పెయిన్ రావడంతో కేతన్ ఆమెను హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ సమస్య తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయగా సోనమ్‌కు క్యాన్సర్‌ వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుండి ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇంట్లో సోనమ్ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతికూల ఆలోచనలతో బాధ పడుతుండేది. దాంతో అది ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూపించేది. దాంతో కేతన్ ఆమెను తనతో పాటు బైక్‌పై తీసుకెళ్తున్నాడు.

watch video :

 

Also Read: తన చావుకి తానే ఏర్పాట్లు చేసుకున్నాడు..! ఇతని కథ వింటే కన్నీళ్లు ఆగవు..!


End of Article

You may also like