లైవ్ లో హేమని ముద్దడిగిన నెటిజెన్…నేను ఇంకా యంగే అంటూ స్ట్రాంగ్ కౌంటర్!

లైవ్ లో హేమని ముద్దడిగిన నెటిజెన్…నేను ఇంకా యంగే అంటూ స్ట్రాంగ్ కౌంటర్!

by Anudeep

Ads

సినిమా వాళ్లు లైవ్లోకి రావడం , నెటిజన్లు అతిగా కామెంట్ చేయడం దానికి వాళ్లు రియాక్ట్ అవ్వడం ఈ మధ్య కామనైపోయింది. అనసూయ, రశ్మిలకు ఈ సమస్య ఎఫ్పుడూ ఉండేదే..వాళ్లు కూడా మాటకి మాట అనే వరకు ఊరుకోరు. మొన్నటికి మొన్న శ్రీయపై కూడా అసభ్యంగా కామెంట్స్ చేశాడు ఒక నెటిజన్..దానికి శ్రీయ సైలెంట్ అయినప్పటికి పక్కనే ఉన్న ఆమె భర్త మాత్రం నెటిజన్ స్టైల్లోనే చురకేసాడు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చిన హేమకి ఇలాంటి చెత్త కామెంట్సే చేశారు కొందరు నెటిజన్స్ . దానికి హేమ డిఫరెంట్ గా రెస్పాండ్ అయ్యారు.

Video Advertisement

లాక్ డౌన్లో అందరూ ఇళ్లల్లోనే ఉండడంతో ఏం చేయాలో పాలుపోక ఒక్కొక్కరూ ఒక్కో రకమైన లైవ్స్ పెడుతున్నారు సెలబ్రిటీలు, ఒకరు వంట చేస్తూ లైవ్ పెడితే మరొకరు ఇల్లు క్లీన్ చేస్తూ, హేమ డిఫరెంట్ గా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అంటూ లైవ్లోకి వచ్చింది.  హేమ లైవ్ కి ఒక్కొక్కరూ ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు..ఆ కామెంట్స్ చూస్తే అందరూ హేమ తయారు చేసిన ఆయిల్ పైన కన్నా హేమపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది.

మీ వయసు ఎంత మేడమ్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేస్తే, యువర్ లుకింగ్ ప్రెట్టీ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేసాడు.  నా ఏజ్ తెలుసుకుని ఏం చేస్తావ్ రా? పెళ్లి చేసుకుంటావా?? ఏంటి??   నేను ప్రెట్టీగా లేకపోవడానికి నాకేమైనా 60-70 ఏళ్లా..?? అంటూ వాళ్ల లైన్లోనే సమాధానాలు ఇస్తూ వచ్చింది. చివరికి ఒక నెటిజన్ ముద్దుపెట్టవా అంటూ చేసిన కామెంట్ కి తిక్కతిక్క వేషాలేస్తే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా, మీలాంటోళ్లని ఇంటికొచ్చి తంతా అంటూ సీరియస్ అయింది.

ఇదే లైవ్లో  బిగ్ బాస్ గురించి మాట్లాడింది.. బిగ్ బాస్ నాకు హెల్ప్ చేయడం ఏంటి.. నేనేమైనా చిన్నా చితకా ఆర్టిస్ట్‌నా ఇండస్ట్రీకి వచ్చి 30ఏళ్లయింది. సో నాకు రావాల్సిన పేరు ఎప్పుడో వచ్చేసింది. బిగ్ బాస్ వల్ల నాకు కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు. నేను సరదాగా వెళ్లాను. ఎంటర్ టైన్ చేశాను. వచ్చాను అంతవరకే..సరే ఇవన్ని ఒకె కాని ఇంతకీ హేమక్క చేసిన ఆయిల్ ఏంటో తెలుసుకుందామా..

కొబ్బరి నూనె 1 కేజీ, బాదం ఆయిల్ 150 గ్రాములు, ఉసిరి ఆయిల్ 150 గ్రాములు తీసుకుని ఆ ఆయిల్‌ని మరిగించి.. మందార ఆకు, వేపాకు, గోరింటాకు, కరివేపాకు, మందార పూలు వేసి బాగా మరిగించి.. ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతి పిండి వేసి మళ్లీ మరిగించాలి. ఆ ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్‌లోకి వచ్చిన తరువాత సన్నని బట్టలో వేసి వడగట్టి అలా వచ్చిన ఆయిల్‌ని తలకు పట్టిస్తే జుట్టు రాలడం, తెల్ల జుట్టు, చుండ్రు, పుండ్లు, పేలు ఇలాంటి సమస్యలు ఉండవు. ఈ ఆయిల్ ముందు రోజు తలకి రాసుకుని మరుసటి రోజు స్నానం చేయాలి.అంతేకాని ఒక గంట ముందు రాసుకుని తన స్నానం చేసేసి.మేం మీ ఆయిల్ రాసుకున్నాం అక్కా. మాకు హెయిర్ రాలేదేంటి అంటే కుదరదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది హేమ..


End of Article

You may also like