Ads
గూగుల్ గురించి తెలీని వారు లేరు. ఇంకా చెప్పాలంటే గూగుల్ దాదాపు ప్రజలందరి నేస్తం. గూగుల్ఉ పయోగించకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు లేరంటే అతిశయోక్తి కాదు. గూగుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Video Advertisement
1. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గడించిన గూగుల్ ను 1998 లో స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన లారీ పేజ్ మరియు సెర్జీ బిన్ లు అనే స్టూడెంట్స్ స్థాపించారు
2. గూగుల్ అనేది సెప్టెంబర్ 4వ తేదీన స్థాపించబడినప్పటికీ 2006 నుండి సెప్టెంబర్ 27వ తారీకునే గూగుల్ యొక్క బర్త్ డే గా సెలబ్రేషన్ చేస్తున్నారు.
3. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్రాండ్ గా అవతరించిన గూగుల్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ 309 బిలియన్ డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఒక బిలియన్ డాలర్ల విలువ సుమారు గా 73, 59, 75, 00, 000. )
4. నాలుగు అతి పెద్ద కంపెనీలు గా అమెజాన్, ఆపిల్, ఫేస్ బుక్ లతో పాటు గూగుల్ కూడా స్థానాన్ని సంపాదించుకుంది
5. గూగుల్ ని వాడే యూజర్ల సౌలభ్యం కోసం యూజర్లు చేసే స్పెల్లింగ్ మిస్టేక్ తో కూడా గూగుల్ పేజ్ ఓపెన్ అయ్యే విధంగా gooogle. Com gogle. Com googlr. Com పేర్లతో కూడా గూగుల్ రిజిస్టర్ అయ్యింది.
6.గూగుల్ హెడ్ క్వార్టర్ గా పిలువబడే గూగుల్ ప్లెక్స్ కాలిఫోర్నియా లో ఉంది.
7. ఉద్యోగులకు భోజన సదుపాయాన్ని అందించే అతి పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీలో గూగుల్ కూడా ఒకటి, ఇది ఉద్యోగులు తమ వెంట తమ పెంపుడు కుక్కలను తెచ్చుకోవడానికి అనుమతిని ఇస్తుంది.
8. గూగుల్ లో పనిచేసే ఉద్యోగి మరణించిన తర్వాత అతని జీతంలో సగభాగాన్ని ప్రతి నెలా వారి జీవిత భాగస్వామికి అందిస్తుంది.
9.గూగోల్’ అన్న పదం నుంచి గూగుల్ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ అంటారు.
10.ఉద్యోగులకు ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టిన తొలి భారీ టెక్ సంస్థ గూగులే.
11. 2006లో గూగుల్ సంస్థలో యూట్యూబ్ కలిసింది. అప్పట్లో సుమారు రూ.10,500 కోట్లకు పైగా మొత్తానికి యూట్యూబ్‌ను గూగుల్ కొనుగోలు చేసింది.
12.గూగుల్ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, చాలా రకాల సేవలు అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్ స్ట్రీమింగ్ సర్వీస్, డ్రైవర్‌లెస్ కార్లకు సంబంధించిన సేవలను కూడా అందించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది.
13.ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 $ గూగుల్ చెల్లిస్తుంది.
14.గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి
15.గూగుల్‌లో ఇప్పుడు వందల బిలియన్ల వెబ్‌పేజీలను కలిగి ఉంది
16.గూగుల్ పేమెంట్ సర్వీస్ కూడా మొదలు పెట్టింది ,ఇండియా లో తేజ్ అనే పేరు మీద మొదలు పెట్టి డిజిటల్ మనీ సర్వీస్ లో టాప్ గా నిలిచింది ,ప్రస్తుతం గూగుల్ పే గా ఇది దూసుకెళ్తుంది
End of Article