వరుస ప్లాపులు.. అయినా అవకాశాలు తగ్గని స్టార్ హీరో కుమారుడు..!

వరుస ప్లాపులు.. అయినా అవకాశాలు తగ్గని స్టార్ హీరో కుమారుడు..!

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీ లో హిట్ లు ప్లాపులు సదరు హీరో, డైరెక్టర్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కొందరు ఒకటి రెండు సినిమాలకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కానీ మరికొందరు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతారు. ఆ కోవలోకే చెందుతారు యంగ్ హీరో ఆది సాయి కుమార్.

Video Advertisement

హీరో ఆది సాయి కుమార్ తన నటన తో, డైలాగ్ డెలివరీ తో ఎందరో అభిమానుల్ని గెలుచుకున్నారు. మొదట్లో మంచి కథల్నే ఎంచుకున్న ఆది తర్వాత కథల ఎంపికలో తడబడ్డాడు.


మొదటి సినిమా ప్రేమ కావాలి తో అందర్నీ తనవైపుకు తిప్పుకున్నారు ఆది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. మరో యంగ్ హ్యాండ్సమ్ హీరో ఇండస్ట్రీ కి దొరికాడు అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కానీ ఆ తరువాత అన్ని ప్లాప్ లే వెక్కిరించాయి. వాటిలో ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, చుట్టాలబ్బాయి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి, గోల్డ్ ఫిష్, శశి, తీస్మార్ ఖాన్ వంటి సినిమాలున్నాయి. మధ్యలో మల్టీస్టారర్ మూవీస్ కూడా చేసాడు ఆది . విభిన్న కథలను ఎంచుకున్నారు, నటనలో వైవిధ్యం చూపినా ఆదిని ప్లాప్ లు వదల్లేదు. అవన్నీ కాదని ఆదికి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయ్.


పది సినిమాలు ప్లాప్ అయినా ఆది స్టార్ హీరో కొడుకు కాబట్టి ఆయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి, అదే ఆ బాక్గ్రౌండ్ లేని హీరోలకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడమే గగనం అంటున్నారు నెటిజన్లు. సొంత టాలెంట్ తో వచ్చిన హీరోలకు ఒక మంచి దర్శకుడు అవకాశం ఇవ్వకుంటే వారి కెరీర్ ముందుకు సాగడం కష్టమే. మరో వైపు ప్లాపులతో సంబంధం లేకుండా ఆది వరుస ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నారు. ఆయన నటించిన జంగిల్, అమరన్, కిరాతక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 


End of Article

You may also like