Ads
సోషల్ మీడియా అనేది చాలా తెలియని విషయాలని తెలుసుకునేలాగా చేసింది. ముఖ్యంగా సెలబ్రిటీలకి, ప్రేక్షకులకి మధ్య దూరాన్ని తగ్గించింది. మామూలుగా అయితే సెలబ్రిటీలు అంటే, వాళ్లతో మాట్లాడటం కష్టం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కష్టం అని అనుకునేవారు. కానీ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి సంబంధించిన విషయాలు ఈజీగా తెలుస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు తమ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇదే సోషల్ మీడియా ద్వారా ఆ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి.
Video Advertisement
కొంత మంది వారికి వారే స్వయంగా షేర్ చేస్తారు. కొంత మంది మాత్రం తమ అభిమాన సెలబ్రిటీకి సంబంధించిన విషయాలని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి, వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటో ఒక కాలేజ్ గ్రూప్ ఫోటో. ఇందులో ఒక హీరో ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రని ఇంకొక మెట్టు ఎక్కించిన వారిలో ఆ హీరో చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఫోటోలో చిరంజీవి ఉన్నారు. చిరంజీవి చదువుకునే రోజుల్లో దిగిన ఫోటో ఇది. ఇందులో ఎడమ నుంచి కుడి వైపుకి, పై వరుసలో మొదటి వారిలో చిరంజీవి ఉన్నారు. ఈ ఫోటోని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ క్లబ్ వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరంజీవి చదువుకున్న తర్వాత సినిమాల్లోకి రావడం, ఆ తర్వాత మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం, ఇవన్నీ మనకి తెలియని విషయాలు కావు.
చిరంజీవి తన స్నేహితులందరికీ కూడా కాంటాక్ట్ లోనే ఉంటారు. ఎంత ఎదిగినా సరే చిరంజీవి తనని ప్రోత్సహించిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. అందరితో చాలా స్నేహంగా ఉంటారు. మామూలుగా కూడా ఎవరి సినిమా అయినా సరే రిలీజ్ అవుతూ ఉంటే, ఈవెంట్ అతిథిగా వెళ్లడం, సినిమా గురించి, అందులో పని చేసిన వారి గురించి మాట్లాడటం చేస్తూ ఉంటారు. అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా అందరి గురించి ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని, వారు చేసిన మంచి పనుల గురించి మాట్లాడడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. చిరంజీవి సీనియర్ నటులతో మాత్రమే కాకుండా, యంగ్ నటులతో కూడా చాలా స్నేహంగా ఉంటూ, వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే చిరంజీవికి దేశవ్యాప్తంగా ఇంత మంది అభిమానులు ఉన్నారు.
ALSO READ : ఇదేందయ్యా ఇది…”భరత్ అనే నేను” లోని పాటలో ఈ సీన్ ఎప్పుడైనా గమనించారా.?
End of Article