ఆస్కార్ సెర్టిఫికెట్ అవసరం లేదు: హీరో నిఖిల్

ఆస్కార్ సెర్టిఫికెట్ అవసరం లేదు: హీరో నిఖిల్

by Megha Varna

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ ఆస్కార్. రాజమౌళి లాంటి ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ కి పంపలేదు. ఈ విషయంపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఆస్కార్ అంటేనే మండిపడుతున్నారు. పైగా ఇంత మంచి సినిమాని వదిలేసి ‘ఛల్లో షో’ అనే గుజరాతీ సినిమాను ఆస్కార్ కి పంపారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Video Advertisement

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాదు ఎంతోమంది ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ సినిమాకి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు నిఖిల్‌ కూడా దీని గురించి మాట్లాడాడు.

ఇప్పుడు ఇవి వైరల్‌గా మారాయి. ఇంతకీ నిఖిల్ ఏమన్నాడంటే… సినిమాపై ప్రజలు చూపించే ప్రేమే ఆస్కార్‌ కంటే చాలా గొప్పవి అని అన్నాడు. ఆస్కార్ పై వేరే అభిప్రాయం తనకి ఉందన్నాడు నిఖిల్. ఆస్కార్‌ కంటే కూడా సినిమాపై ప్రజలు చూపించే ప్రేమే ముఖ్యం అన్నాడు.

అందరికీ ఆస్కార్ ఇష్టమే కానీ ప్రజల ప్రేమే సినిమాకు అతి పెద్ద విజయం అన్నాడు. పైగా అవి RRR కి దక్కాయన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఈ సినిమాకి లభించిందన్నారు. అదే నిజంగా సినిమాకి విజయం. కనుక ఆస్కార్‌కి వెళ్తే ఎంత, వెళ్లకపోతే ఎంత అని అన్నాడు హీరో నిఖిల్. ఫిల్మ్‌ ఫేర్‌ వంటి అవార్డ్స్ మనకి ఉన్నాయని ఆస్కార్ గురించి ఎందుకని అన్నాడు నిఖిల్.

అస్కార్‌కు నేనైతే ప్రాముఖ్యత ఇవ్వనని చెప్పేసాడు. భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతీ చోట కూడా హిట్ అవుతున్నాయి. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాని స్పెయిన్ లో చూశానని.. అక్కడ థియేటర్‌లు హౌస్‌ఫుల్‌ అయ్యాయని నిఖిల్ అన్నాడు. స్పానిష్ లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాను చూస్తున్నారన్నారు. RRR అమెరికా డిస్ట్రిబ్యూటర్ మాత్రం కొన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలో 10,00 మంది సభ్యులకు పిలుపివ్వడం జరిగింది.


End of Article

You may also like