Ads
సాధారణంగా సినిమాల్లో ఎవరైనా ఒక యాక్టర్ కి చిన్నప్పటి పాత్ర ఏదైనా ఉంటే ఆ యాక్టర్ పోలికల్లో ఉండే నటులని ఆ చిన్నప్పటి పాత్రకి తీసుకుంటారు. అలా కొన్ని సినిమాల్లో మన హీరోల చిన్నప్పటి పాత్రలో వాళ్ల కొడుకులు నటించారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 కృష్ణ
రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఈ ఒక్క సినిమానే కాకుండా ఇంకా కొన్ని సినిమాల్లో కూడా కృష్ణ గారి చిన్నప్పటి పాత్రలో నటించారు రమేష్ బాబు.
#2 మోహన్ బాబు
మంచు మనోజ్ పుణ్యభూమి నాదేశం అనే సినిమాలో మోహన్ బాబు గారి చిన్నప్పటి పాత్రను పోషించారు.
#3 రవితేజ
రాజా ది గ్రేట్ సినిమా లో రవితేజ చిన్నప్పటి పాత్రని, రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు పోషించాడు.
#4 సుధీర్ బాబు
శమంతకమణి సినిమాలో సుధీర్ బాబు కొడుకు దర్శన్ సుధీర్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించాడు. మోసగాళ్లకు మోసగాడు సినిమా లో సుధీర్ బాబు మరొక కొడుకు మానస్ చరిత్ సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర పోషించాడు.
#5 విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి, నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమా తెలుగులో నేను రౌడీ నే పేరుతో డబ్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య విజయ్ సేతుపతి, విజయ్ సేతుపతి చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.
#6 మహేష్ బాబు
వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్, చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో కనిపించాడు.
#7 జయరామ్
పంచతంత్రం, అల వైకుంఠపురంలో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు జయరామ్. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో పుత్తమ్ పుదు కాలై అనే తమిళ్ సినిమా విడుదలైంది. ఇందులో ఐదు కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథకి ఒక్కొక్క డైరెక్టర్ దర్శకత్వం వహించారు. అందులో ఒక కథకి సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ కథలో జయరామ్ యంగ్ ఏజ్ లో ఉన్న పాత్రని ఆయన కొడుకు, నటుడు కాళిదాస్ జయరామ్ పోషించారు.
End of Article