Ads
సీనియర్ నటుడు సురేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన 270 కి పైగా సినిమాలు చేశారు. కేవలం నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కూడా చేశారు.
Video Advertisement
కొంతకాలం పాటు తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగి తర్వాత కెరియర్ ఫాల్డౌన్ అవుతున్న సమయంలో విలన్ పాత్రలను కూడా పోషించారు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సురేష్ సీరియల్స్ లో కూడా నటించారు.
అయితే హీరోగా ఒక వెలుగు వెలిగిన రోజులలో సురేష్ ఎంతో స్లిమ్ గా, ఎంతో అందంగా ఉండేవారు. అయితే రాను రాను బరువు పెరిగి 120 కిలోలకి చేరిపోయారు. అప్పుడే సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ ఉండటంతో బరువు పెరగడం వల్లే సినిమాలు చేయటం లేదనే వార్తలు ఆయన చెవిన పడ్డాయి. ఎలా అయినా బరువు తగ్గాలని గత ఐదు నెలలుగా కఠినమైన డైట్ ఫాలో అవుతూ భారీగా బరువు తగ్గారు.
అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ తన వెయిట్ లాస్ గురించి తన డైట్ ప్లానింగ్ గురించి మాట్లాడారు. నిద్రలేచిన తర్వాత ఒక గంట వరకు ఎలాంటి కాంప్లెక్స్ ఫుడ్స్ తీసుకోనని,కేవలం నీళ్లు, గ్రీన్ టీ తీసుకుంటాను. ఒక గంట తర్వాత అరటిపండు లేదా ఆపిల్ తీసుకుంటాన అది కాకపోతే టమాటా తీసుకుంటాను. 9 గంటల సమయంలో గుడ్డు లోని తెల్లసొన తింటాను. ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటాను. ఉడికించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాను.
లంచ్ లో పుల్కాలు, కొంచెం రైస్ తీసుకుంటాను. సండే మాత్రం బిర్యానీ రైస్ తింటాను. చికెన్ గ్రిల్ ఫిష్ లేదంటే వెజిటబుల్స్ తింటాను. మధ్యాహ్నం కడుపునిండా ఫుడ్ తీసుకుంటాను, ఆ తర్వాత కనీసం 15 గంటల వరకు ఏమీ తినను అని తన డైట్ ప్లాన్ చెప్పారు సురేష్. గత ఐదు నెలలుగా 21 కేజీలు బరువు తగ్గాను, డాక్టర్లకు ఫోన్ చేసి విషయం చెప్తే షాక్ అయ్యారు. ఇలాంటి డైట్ చేస్తే చచ్చిపోతావు అంటూ సజెస్ట్ చేశారు. అప్పుడు ప్రాపర్ గా తినడం స్టార్ట్ చేశాను అన్నాడు సురేష్.
End of Article