Ads
సాధారణంగా చాలా సినిమాల్లో ముందు ఒక హీరోని అనుకొని, తర్వాత ఒక హీరో ఆ సినిమా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అలా ఎంతో మంది హీరోలకి మొదట ఒక సినిమా కథ వెళ్లడం, కొన్ని కారణాల వల్ల వారు ఆ సినిమా చేయకపోవడం, ఆ తర్వాత మరొక హీరో ఆ సినిమా చేయడం అనేది జరుగుతూ ఉంటాయి.
Video Advertisement
అలా కొంత మంది హీరోలు ఎంతో పెద్ద హిట్ సినిమాలని మిస్ చేసుకున్నారు. విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటించిన హిట్ సినిమా దేశముదురు. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ అన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హన్సిక హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యారు.
అయితే ఈ సినిమా కథని అంతకుముందు మరొక హీరోకి వినిపించారు. ఆ హీరో ఎవరో కాదు సుమంత్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా కథని సుమంత్ కి వినిపించారు. హీరో ఒక సన్యాసినితో ప్రేమలో పడతాడు అని డైరెక్టర్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత కొన్ని కారణాలవల్ల సుమంత్ ని ఈ కథ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో సుమంత్ ఈ సినిమాని చేయలేను అని చెప్పేశారు.
అప్పుడు ఈ కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అల్లు అర్జున్ ఈ కథ విని సినిమా చేస్తానని చెప్పారు. అలా అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో చేసి మరొక హిట్ అందుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు బాల గోవింద్ పాత్రలో అల్లు అర్జున్ ని తప్ప మరొక నటుడిని ఊహించుకోలేము అని అన్నారు. అల్లు అర్జున్ చేసిన డాన్స్, యాక్షన్ అవన్నీ కూడా ప్రేక్షకులకి తెగ నచ్చేసాయి.
అందుకే ఈ సినిమాకి ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. అందులో అల్లు అర్జున్ డైలాగ్స్ చెప్పిన స్టైల్ కూడా ప్రేక్షకులకు డిఫరెంట్ గా అనిపించింది. ఒకరకంగా అల్లు అర్జున్ ని స్టార్ గా మరొక మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఈ సినిమాతో అల్లు అర్జున్ హిట్ కొట్టారు. మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నారు.
End of Article