చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే… సాయి పల్లవికే హీరో నో చెప్పాడంట.? ఎవరంటే.?

చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే… సాయి పల్లవికే హీరో నో చెప్పాడంట.? ఎవరంటే.?

by Mohana Priya

Ads

హీరోయిన్స్ అంటే ఇలాగే ఉండాలి అని ఒక ఆలోచనని బ్రేక్ చేస్తూ, హీరోయిన్స్ అంటే నటన రావడం అనేది ముఖ్యం అనే విషయాన్ని నిరూపించిన నటి సాయి పల్లవి. హీరోయిన్స్ అందరూ ఒకవైపు ఉంటే, సాయి పల్లవి మాత్రం మరొక వైపు ఉంటారు. ఫెయిర్ నెస్ బ్రాండ్స్ ప్రమోట్ చేయడం వంటి వాటి జోలికి వెళ్లరు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అలాంటివి చేయను అని చెప్పారు. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం అనే విషయాన్ని సాయి పల్లవి చాలా సార్లు చెప్తూ ఉంటారు. అంతే కాకుండా, సాయి పల్లవి తనకి ఏదైనా స్క్రిప్ట్ నచ్చకపోతే కూడా రిజెక్ట్ చేసేస్తారు. అలా చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేశారు.

Video Advertisement

అందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఉన్నట్టు సమాచారం. ఇందులో ఉన్న కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ చేయలేకపోవడం అనే కారణంగా సాయి పల్లవి ఈ సినిమా రిజెక్ట్ చేశారు. కొన్ని పరిమితులు పెట్టుకొని, అవి మాత్రమే ఫాలో అవుతూ, అందులో కూడా తన స్టైల్ నటన చూపిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కేవలం డియర్ కామ్రేడ్ మాత్రమే కాదు. ఇంకా చాలా సినిమాలని సాయి పల్లవి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశారు. కానీ మొదటిసారి సాయి పల్లవిని ఒక సినిమాలోకి తీసుకోవడానికి ఒక హీరో రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఆయన మరెవరో కాదు. విజయ్ దేవరకొండ.

hero who rejected sai pallavi for his movie

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం మొదటిగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నారట. కానీ ఇది కూడా ఒక లవ్ స్టోరీ. ఇందులో కూడా కొన్ని హీరో, హీరోయిన్ మధ్య కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి సాయి పల్లవి ఈ సినిమాకి సూట్ అయ్యే అవకాశం లేదు అనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ సాయి పల్లవిని ఈ సినిమా కోసం వద్దు అని చెప్పారట. దాంతో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ, ప్రస్తుతం అయితే ఈ విషయం ప్రచారంలో ఉంది.

Vijay Devarakonda: Net Worth for 2023, Lifestyle, Car Collection, Remuneration Details

మరొక పక్క సాయి పల్లవి, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న అమరన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇది సాయి పల్లవి నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా. తక్కువ సినిమాలు చేసినా కూడా గుర్తుండిపోయే సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతో కేవలం కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే సాయి పల్లవి ఎంచుకుంటున్నారు. ఏ పాత్ర చేసినా కూడా ప్రాముఖ్యత ఉండాలి అనే ఆలోచనతోనే సాయి పల్లవి ఇలా చేస్తున్నారు.

ALSO READ : “ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం… అంబానీ హోటల్ అయినా కూడా..!” అంటూ… “నెగిటివ్ కామెంట్స్” పై కీర్తి భట్ భర్త రియాక్షన్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like